చైనావోడి అతి పెద్ద బోరుబావి గురించి తెలిస్తే గుండె గుభేల్

అయితే.. ప్రపంచంలోని అత్యంత లోతైన బోరుబావి రష్యా పేరు మీద ఉంది.

Update: 2025-02-22 04:26 GMT

విన్నంతనే విస్మయానికి గురి చేసే పనుల్ని చేసే విషయంలో చైనావోడి ట్రాక్ రికార్డు తెలిసిందే. తాజాగా మరో అంశం వెలుగు చూసింది. ఒక ప్రాజెక్టులో భాగంగా అత్యంత లోతైన బోరుబావిని రికార్డును నమోదు చేసింది. ఆసియాలోనే అత్యంత లోతైన బోరుబావిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇంతకూ లోతు ఎంతో తెలుసా? జస్ట్ 10.9 కిలోమీటర్లు. దీని తవ్వకానికి చైనాకు 580 రోజులు పట్టింది. అయితే.. ప్రపంచంలోని అత్యంత లోతైన బోరుబావి రష్యా పేరు మీద ఉంది. ఆ దేశం 12 కిలోమీటర్ల లోతైన బోరుబావిని తవ్వింది.

ఇంతకూ ఇంత లోతైన బోరుబావిని తవ్వటానికి కారణం చమురు.. గ్యాస్ వంటి నిక్షేపాల కోసమే కాకుండా శాస్త్రపరిశోధనల కోసం దీన్ని తవ్వినట్లుగా చెబుతున్నారు. ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది చైనా జాతీయ పెట్రోలియం కార్పొరేషన్. వాస్తవానికి 10కిలోమీటర్ల లోతైన బోరుబావిని తవ్వే ప్రాజెక్టును చేపట్టగా.. అది చివరకు 10.9 కిలోమీటర్ల వరకు వెళ్లి ఆగింది.

భూ పరిమాణం.. అత్యంత లోతులో ఏం జరుగుతోంది? లాంటి వివరాల్ని సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా చెబుతున్నారు. దీని కోసం తక్మకాన్ ఎడారి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 2023 మే 30న మొదలైన ఈ భారీ ప్రాజెక్టుకు భారీ సవాళ్లు ఎదురైనట్లుగా చెబుతున్నారు. అయినప్పటికి విడవకుండా దాని లెక్క తేల్చినట్లుగా చెబుతున్నారు. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని వెల్లడించాలి.

10 వేల మీటర్లు తవ్వేందుకు 279 రోజులు పట్టగా.. 910 మీటర్ల డ్రిల్లింగ్ కు దాదాపు 300 రోజులు పట్టినట్లుగా చెబుతున్నారు. ఈ డ్రిల్లింగ్ 12 భౌగోళిక నిర్మాణాల్లోకి చొచ్చుకుపోయినట్లుగా పేర్కొన్నారు. దీంతో.. 50 కోట్ల సంవత్సరాల రాతి పొరల్ని డ్రిల్లింగ్ చేరుకున్నట్లుగా చైనా అధికార వర్గాలు వెల్లడించాయి. లోతు పెరుగుతున్న కొద్దీ ఎన్నో సవాళ్లను తాము ఎదుర్కొన్నట్లుగా అధికారులు వెల్లడించారు.

ప్రతి మీటర్ లోతు పెరిగే కొద్దీ ఎన్నో సవాళ్లు.. సమస్యల్ని అధిగమించి మరీ తాము అనుకున్న దాని కంటే ఎక్కువ లోతును డ్రిల్ చేశారు. 1989లో ప్రపంచంలోనే అత్యంత లోతైన బోరుబావిని రష్యా డ్రిల్ చేసింది. కోలా సేూపర్ డీప్ బోర్ హోల్ ఎస్ జీ పేరుతో 12.2 కిలోమీటర్ల లోతుకు బోరుబావిని డ్రిల్ చేసిన రికార్డు నేటికి పదిలంగా ఉండిపోయింది. శాస్త్రసాంకేతికంగా ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఇన్ని సవాళ్లు చైనాకు ఎదురయ్యాయి అన్నప్పుడు.. దాదాపు పాతికేళ్ల క్రితమే అంత లోతుకు రష్యా డ్రిల్ చేయటం నిజంగానే గొప్ప కదూ?

Tags:    

Similar News