కాంగ్రెస్ మార్క్ సామాజిక న్యాయం!

ఇక విధంగా లిమిటెడ్ కంపెనీగా ప్రాంతీయ పార్టీలో అధికారం కానీ పదవులు కానీ కొందరికే దక్కుతాయి. ఆ విధంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ లో సామాజిక న్యాయం చాలా ఎక్కువ

Update: 2023-10-28 09:30 GMT

అవును ఇది నిజమే. కాంగ్రెస్ అందరి పార్టీగానే ఉంది. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం అనాదిగా సాగుతూ వస్తోంది. ఈ దేశంలో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రులు మంత్రులు ఇతర కీలక పదవులు అన్నీ దాదాపుగా అన్ని కులాల వారూ అందుకున్నారు. ప్రాంతీయ పార్టీలలో మాత్రం ఆ సమతూకం న్యాయం ఉండదు, పైగా అక్కడ కుటుంబ పాలన మొదలవుతుంది.

ఇక విధంగా లిమిటెడ్ కంపెనీగా ప్రాంతీయ పార్టీలో అధికారం కానీ పదవులు కానీ కొందరికే దక్కుతాయి. ఆ విధంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ లో సామాజిక న్యాయం చాలా ఎక్కువ. కాంగ్రెస్ ఈ దేశాన్ని అనేక రాష్ట్రాలను దశాబ్దాల పాటు ఏలింది. ఆ సమయంలోనే ఎంతో మంది కీలక పదవులు అలంకరించారు. అని చెప్పాలి. ఈ రోజున దేశంలో వెల్లి విరుస్తున్న సామాజిక చైతన్యానికి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ అంటే కచ్చితంగా అదే నిజం అని కూడా చెప్పాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ రెండు విడతలుగా తెలంగాణాలోని తమ పార్టీ పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితా కనుక చూస్తే వంద మంది దాకా ఉన్నారు. ఇందులో దాదాపుగా అన్ని వర్గాలకు అన్ని కులాలకు మతాలకు కాంగ్రెస్ న్యాయం చేసింది అని చెప్పాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు మొత్తం 100 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ప్రకటనను తీసుకుంటే సామాజికవర్గాల వారీగా కాంగ్రెస్ కేటాయించిన అసెంబ్లీ స్థానాలు ఇలా ఉన్నాయి. రెడ్డి - 33, బీసీ - 18, వెలమ - 8, కమ్మ - 3, బ్రాహ్మణ - 3, మైనారిటీ 4, ఎస్సీ - 19, ఎస్టీ - 12 స్థానాలు కేటాయింపులు చేసింది. ఇంకా 19 స్థానాలు పెండింగులో ఉన్నాయి. మిగిలిన కులాలకు లేక ఇతర సామాజిక వర్గాలకు కూడా ఆ జాబితాలో న్యాయం చేస్తుంది అని కూడా చెప్పాల్సి ఉంటుంది.

ఇక ముఖ్యమంత్రులను మార్చుకుంటూ పోతున్నారు అని కాంగ్రెస్ మీద ఒక అపప్రధ ఉంది. కానీ ఎవరు సీఎం గా ఉన్నా కూడా కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక అమలు అవుతుంది. అలాగే కాంగ్రెస్ ఫిలాసఫీ ప్రకారమే పాలన సాగుతుంది. కాబట్టి సీఎం ఎవరు అన్నది ప్రశ్న కానే కాదు, అదే టైం లో చాలా మందికి అనేక సామాజిక వర్గాలకు కూడా అత్యున్నతమైన సీఎం పదవిని అందుకునే అవకాశాలను కాంగ్రెస్ ఎక్కువగా ఇచ్చింది అన్నది కూడా గుర్తు పెట్టుకోవాల్సి ఉంది.

ఇది పూర్తిగా పాజిటివ్ అంశంగా చూస్తే కాంగ్రెస్ తరఫున అనేక కులాల వారు సీఎం లు అయ్యారు. ఇక ముఖ్యమంత్రులను మార్చినా మంత్రులను మార్చినా చాలా మందికి అవకాశాలు దక్కేది మాత్రం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే అని అంటున్నారు. ఇక్కడ కూడా ప్రాంతీయ పార్టీల నుంచి చెప్పుకుంటే ఒకే కులం లేదా ఒకే వర్గమే ఏళ్ళ తరబడి అధికారంలో ఉంటుందని విమర్శలు ఉన్నాయి. అలా చూసుకుంటే కనుక కాంగ్రెస్ చాన్స్ ఇవ్వడం ద్వారా అనేక కులాలకు సామాజిక న్యాయం దక్కుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News