కాంగ్రెస్ జిల్లాల సంఖ్య కుదిస్తుందా?

పార్లమెంట్ నియోజకవర్గాల పరంగా చూసినా 17 జిల్లాలే అవసరమవుతాయి. జనాభా పరంగా చూసినా 22 జిల్లాలు కావాలి. కానీ ఎటు కాకుండా 33 జిల్లాలు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తల పట్టుకుంటోంది.

Update: 2024-05-20 05:11 GMT

బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు కష్టం కలిగిస్తున్నాయి. జిల్లాల ఏర్పాటులో ఎలాంటి సూత్రాలు పాటించకుండా ఇబ్బడిముబ్బడిగా జిల్లాల సంఖ్య పెంచడంతో ఏం తోచని పరిస్థితి. పాలన గాడిన పడటం లేదు. అధికారులు సరైన రీతిలో ఉండటం లేదు. దీంతో పరిపాలన గాడి తప్పింది. పనులు ముందుకు సాగడం లేదు. బీఆర్ఎస్ చేసిన పాపం కాంగ్రస్ ను వేధిస్తోంది.

పార్లమెంట్ నియోజకవర్గాల పరంగా చూసినా 17 జిల్లాలే అవసరమవుతాయి. జనాభా పరంగా చూసినా 22 జిల్లాలు కావాలి. కానీ ఎటు కాకుండా 33 జిల్లాలు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తల పట్టుకుంటోంది. కొన్ని జిల్లాల్లో అధికారులు సరిగా ఉండటం లేదు. దీని వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భవిష్యత్ లో ఇంకా కష్టాలు పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి.

ఇప్పుడు జిల్లాల సంఖ్య కుదించాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తోంది. కానీ ఆ పని చేస్తే బీఆర్ఎస్ సెంటిమెంట్ ను రాజేసి లేనిపోని ఉద్యమాలు చేసే అవకాశం లేకపోలేదని చెబుతోంది. ఈనేపథ్యంలో జిల్లాల రద్దు వ్యవహారంలో ఏం చేయలనే ఆలోచనలో తలమునకలై పోతోంది. దీంతో జిల్లాల తగ్గింపు వ్యవహారంలో కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకోవడానికి వెనుకంజ వేస్తోందని తెలుస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. ప్రస్తుతం జిల్లాల సంఖ్య కుదిస్తే అదే వెనకంజ వేస్తుంది. బీఆర్ఎస్ ఉద్యమాలకు తోడు ఇలాంటి నష్టాలు పార్టీకి దెబ్బ తీస్తాయని ఆలోచిస్తోంది. కానీ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనే దిశగా కూడా పలు ఆలోచనలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ కు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనేదే కాంగ్రెస్ లక్ష్యం.

ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎక్కడకు దారి తీస్తాయో అర్థమవుతోంది కదా. ప్రజలకు జవాబుదారీగా ఉండే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు జరిగినా తిరిగి కోలుకోవడం కష్టమవుతుందని తర్జనభర్జన పడుతోంది. దీని కోసమే సరైన పరిస్థితుల కోసం ఆరా తీస్తోంది.

Tags:    

Similar News