జస్ట్ లక్ & చంద్రబాబు... పవన్ పై కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు!
అనంతరం ఆయనపై జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతుంది.
తిరుమల లడ్డూ లో కల్తీ జరిగిందంటూ పుట్టిన ఓ వివాదంపై ఘాటుగా స్పందిస్తూ, సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం తన ప్రాణాలైన ఇస్తానంటూ సీరియస్ గా స్పందించారు పవన్ కల్యాణ్. అనంతరం ఆయనపై జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ సమయంలో తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ తురునావుకరసర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... రాహుల్ గాంధీ, డీఎంకే నేతలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తిరుచీలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలో పాల్గొన్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు తిరునావుకరసర్ స్పందించారు! ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ అదృష్టవసాత్తు విజయం సాధించారని అన్నారు!
ఈ సందర్భంగా... పవన్ అదృష్టవశాత్తు విజయం సాధించాడని.. చంద్రబాబు దాతృత్వం వల్లే ఇప్పుడు ఉపముఖ్యమంత్రి పదవిని అధిష్టించారని అన్నారు! ఇదే సమయంలో... తమిళనాడు నేతలను విమర్శించేటంత స్థాయి పవన్ కు లేదని.. ఆయన జాతీయ స్థాయిలో గొప్ప నాయకుదు కాదని.. అందుకే ఆయన అభిప్రాయాన్ని తమిళనాడు డిప్యూటీ సీఎం తోసిపుచ్చి వెళ్లిపోయారని పేర్కొన్నారు!
ఇక రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు చేస్తే.. భారతదేశంపై విమర్శలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని.. దేశాన్ని విమర్శించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక్కటి కాదని.. రెండూ వేరు వేరని తెలిపారు.
ఇక నటుడు విజయ్ నిర్వహిస్తున్న సదస్సు సక్సెస్ కవాలని కోరిన కాంగ్రెస్ ఎంపీ... ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీని ప్రారంభించొచ్చని.. దాన్ని ఆమొదించాలా, వద్దా అనేది ప్రజల ఇష్టమని అన్నారు. పార్టీ పెట్టే ప్రతీ ఒక్కారూ ఎంజీఆర్ కాలేరని, అలాని ప్రతీ ఒక్కరూ ఫెయిల్ అవుతారని చెప్పలేమని తెలిపారు.