మోడీని ఇరికించ‌బోయి.. తానే ఇరుక్కున్న కాంగ్రెస్‌.. ఏం జ‌రిగిందంటే!

ఈ క్ర‌మంలో తాజాగా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఉన్న ఒక వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్ట‌ర్‌(ఎక్స్‌)లో పోస్టు చేసి.. మోడీని ఇరికించ‌బోయి.. తానే ఇరుక్కుంది.

Update: 2023-09-17 06:54 GMT

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు పార్టీలు అనేక విన్యాసాలు చేస్తుంటాయి. అయితే.. ఒక్కొక్క‌సారి ఈ విన్యాసాలు ఎదురు తిరిగి.. వీటిని ప్ర‌యోగించిన వారికే ఎదురు దెబ్బ‌తగులుతుంటుంది. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి కాంగ్రెస్‌కు కూడా ఎదురైంది. ఇటీవ‌ల కాలంలో ఈశాన్య రాష్ట్రాల వ్య‌వ‌హారం వివాదాస్ప‌దంగా మారిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా మ‌ణిపూర్ స‌హా.. చైనా స‌రిహ‌ద్దు రాష్ట్రాల వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దుమారం రేపింది.

ఈ క్ర‌మంలో ఈశాన్య రాష్ట్రాల విష‌యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తీవ్ర ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తు న్నార‌ని, చైనా దూకుడుకు అడ్డుక‌ట్ట వేయ‌లేక పోతున్నార‌ని కాంగ్రెస్‌పార్టీ నాయ‌కులు ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఉన్న ఒక వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్ట‌ర్‌(ఎక్స్‌)లో పోస్టు చేసి.. మోడీని ఇరికించ‌బోయి.. తానే ఇరుక్కుంది.

ఈ వీడియోలో ఈశాన్య రాష్ట్రాలు లేకుండానే రూపొందించిన భాత‌ర దేశ మ్యాప్‌ను ప్ర‌ద‌ర్శించారు. అంటే కాంగ్రెస్ ఉద్దేశంలో ఈశాన్య రాష్ట్రాల‌ను మోడీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఈ రాష్ట్రాల‌ను పొరుగున ఉన్న చైనాకు ధారాద‌త్తం చేశార‌ని విమ‌ర్శించే ఉద్దేశం ఉంది. అయితే.. ఇలా చేయ‌డంపై అనేక విమ‌ర్శ‌లు కాంగ్రెస్‌ను చుట్టుముట్టాయి. ముఖ్యంగా అస్సాం ముఖ్య‌మంత్రి తీవ్ర‌స్థాయిలో కాంగ్రెస్‌పై మండి ప‌డ్డారు.

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే తొందరలో ఈశాన్య రాష్ట్రాలపై వారి అసలు ఉద్దేశ్యాన్ని బయటపెట్టుకున్నారని అన్నారు. భారతదేశం పటంలో ఈశాన్య రాష్ట్రాలను తొలగించి విదేశాల్లో కలిపేశారని విమ‌ర్శించారు. బహుశా మొత్తం భూమిని ఏదైనా పొరుగుదేశానికి అమ్మెందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుని ఉంటారని ఆయ‌న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీని కోసమేనా రాహుల్ గాంధీ ఇటీవల విదేశాలకు వెళ్లారని ఆయ‌న ప్ర‌శ్నించారు.

''ఈ ట్వీట్ చూడగానే షాకయ్యా. కాంగ్రెస్ పార్టీ మన ఈశాన్య రాష్ట్రాలను చైనాకు అమ్మేసిందా ఏంటనుకున్నాను. ఇది ఉద్దేశ్యపూర్వకంగానే పాల్పడిన దేశ వ్యతిరేక చర్య'' అని సీఎం శ‌ర్మ‌ అన్నారు.

ప్యార‌డీ చేయ‌బోయి..కాంగ్రెస్ పార్టీ పోస్టు చేసిన‌ వీడియోలో ప్రధాని నరేంద్ర మోడీ... రాహుల్ గాంధీ బాలీవుడ్ క్లాసిక్ 'దీవార్' సినిమాలోని అమితాబ్ బచ్చన్ శశి కపూర్ మధ్య జరిగే సంభాషణను పేరడీ చేశారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. మోడీ మాట్లాడుతూ.. ' నా దగ్గర ఈడీ, పోలీస్, అధికారం, డబ్బు. స్నేహితులు అనీ ఉన్నాయి.. నీ దగ్గరఏముంది? అని అడగగా రాహుల్ సమాధానమిస్తూ ''నా దగ్గర తల్లి లాంటి యావత్ భారతదేశమే ఉంది'' అని సమాధానమిస్తారు. అయితే, ఈ బ్యాక్ గ్రౌండ్‌లో ఈశాన్య రాష్ట్రాలు లేని భార‌త మ్యాప్‌ను ప్ర‌ద‌ర్శించ‌డం కాంగ్రెస్‌కు శ‌రాఘాతంగా మార‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News