కాంగ్రెస్ "పింక్" వ్యూహం... ఆ కారు నెంబర్ "కే.సీ.ఆర్.420"!

ఇదే సమయలో వారి సందేశాన్ని మరింత విస్తృతం చేయడానికి అన్నట్లు ఈ ప్రచార కారులు కేసీఆర్ వ్యతిరేక నినాదాలతో తిరగడంతోపాటు ప్రచార పాటాలను కూడా ప్రత్యేకంగా సెట్ చేశారు.

Update: 2023-11-04 08:02 GMT

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచుతున్నాయి. ప్రధానంగా బీఆరెస్స్ – కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బీఆరెస్స్ నేతలు ఒకటంటే... కాంగ్రెస్ నేతలు పదంటున్నారు. అంతిమంగా... నువ్వు తమలపాకుతో కొడితే నేను తలుపు చెక్కతో కొడతాను అన్నట్లుగా సాగిపోతోంది ఇరువైపులా మాటల యుద్ధాలు, సరికొత్త ఎత్తుగడల వ్యవహారం.

మరోపక్క కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ విషయంలో కేసీఆర్ & కో ని విపక్షాలు విపరీతంగ టార్గెట్ చేస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... బీఆరెస్స్ కు పింకి కలర్ కారు, దానిపై కొన్ని రాతలతో షాకిచ్చేలా సరికొత్త వ్యూహానికి తెరలేపింది.

అవును... ఇప్పుడు తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పింక్ కలర్ కార్లు తిప్పాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది! పింక్ అంటే కేసీఆర్ పార్టీ జెండా రంగు, కార్ అంటే ఆ పార్టీ ఎన్నికల గుర్తు! అయినా ఆ రెండింటినీ కలిపి జనాల్లోకి పంపుతుంది కాంగ్రెస్ పార్టీ. అలా అని ఖాళీగా కాదు సుమా..! ఆ కారంతా కామెంట్లతో నింపేసింది.. ఇక సాంగ్స్ ఉండనే ఉంటాయి!

ఇందులో భాగంగా... కారు వెనుక అద్ధం ప్లేస్ లో "బై బై కేసీఆర్" అనే నినాదంతో ముద్రించడంతోపాటు... కారు చుట్టు... "కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల్లో అవినీతి", "దళితులు, బీసీల పథకాల వైఫల్యం", "టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో పేపర్‌ లీక్‌ లు", "ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయం", మరి ముఖ్యంగా... "మోసపూరిత పథకాలు, అమలుకాని హామీలు" వంటి కీలక విమర్శలు ఈ వాహనంపై రాసి ఉంటాయి. ఇక ఆ కారు నెంబర్ ప్లేట్ ప్లేస్ లో... కే.సీ.ఆర్.420 అని రాసి ఉండటం గమనార్హం.

ఇదే సమయలో వారి సందేశాన్ని మరింత విస్తృతం చేయడానికి అన్నట్లు ఈ ప్రచార కారులు కేసీఆర్ వ్యతిరేక నినాదాలతో తిరగడంతోపాటు ప్రచార పాటాలను కూడా ప్రత్యేకంగా సెట్ చేశారు. కేసీఆర్ చెప్పిన మాటలకూ, చేసిన పనులకూ ఎక్కడా పొంతనలేదు అన్నట్లుగా ఈ కార్లు ప్రతిరోజూ తమకు కేటాయించిన నియోజకవర్గాలలో పర్యటించాలనేది టి.కాంగ్రెస్ ప్లాన్ లా ఉందని అంటున్నారు.

ఫలితంగా... ఈ వినూత్న ప్రయత్నంతో ప్రజల దృష్టిని ఆకర్షించి.. కేసీఆర్ వ్యతిరేక సందేశాన్ని ఇంటింటికి నడిపిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. మరి ఇలా ఈ కార్లపై నడుస్తున్న కేసీఆర్ వ్యతిరేక ప్రచారానికి అన్ని రకాలుగానూ అనుమతి లభిస్తుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అనుమతి లభిస్తే మాత్ర కచ్చితంగా ప్రభావం చుపిస్తుందనేది కాంగ్రెస్ నేతల నమ్మకంగా ఉంది! మరి ప్రజల రిసీవింగ్ ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి!

Tags:    

Similar News