బీఆర్ ఎస్ జింపింగుల‌కు కాంగ్రెస్ టికెట్లు.. దానం పోటీ ఎక్కడ నుంచంటే!

మొత్తంగా 57 మంది అభ్యర్థులతో మూడో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

Update: 2024-03-22 02:30 GMT

రాజ‌కీయాలా మ‌జాకానా? జంపింగులు సైతం మ‌న వాళ్ల‌యిపోతారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌త్తులు నూరిన వారు కూడా.. మ‌న గూటికి వ‌స్తే.. మ‌న మ‌న‌షులు అయిపోతారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లోనూ ఇదే జ‌రిగింది. తాజాగా ఈ పార్టీ విడుద‌ల చేసిన జాబితాలో బీఆర్ ఎస్ నుంచి రెండు రోజుల కింద‌ట కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన దానం నాగేంద‌ర్ స‌హాప‌లువురికి.. ఆపార్టీ పార్ల‌మెంటు సీట్లు ప్ర‌క‌టించింది. మొత్తంగా 57 మంది అభ్యర్థులతో మూడో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

తెలంగాణ నుంచి ఐదుగురు అభ్యర్థులకు తాజా జాబితాలో కాంగ్రెస్ పార్టీ అవ‌కాశం క‌ల్పించింది. పెద్ద పల్లి నుంచి వంశీకృష్ణ, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి పోటీలో ఉండ‌ను న్నారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో మ‌రో 8 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే.. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, సునీత మహేందర్ రెడ్డి‌లకు పార్టీ అధిష్ఠానం టిక్కెట్లు కేటాయించడం మాత్రం చ‌ర్చ‌నీయాంశం అయింది.

లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 57 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ కీలక నేత అధిర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్ నుంచి మళ్లీ పోటీ చేయను న్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. కాగా, కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో నలుగురిని ఖరారు చేసింది. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేశ్ షేట్కార్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డిల పేర్లను ప్రకటించిన విష‌యం తెలిసిందే.

తాజాగా జాబితాలో చోటు ద‌క్కింది వీరికే

+ పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ

+ సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్

+ చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి

+ మల్కాజ్‌గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి

+ నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి

ప్ర‌క‌టించాల్సిన స్థానాలు..

+ మెదక్, ఖమ్మం, భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

Tags:    

Similar News