సీతారాం ఏచూరి ఇక లేరు.. జాతీయ రాజకీయాల్లో విషాదం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Update: 2024-09-12 11:03 GMT

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి అనారోగ్యంతో కన్నుమూశారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన సీతారం ఏచరి శ్వాసకోశ సంబంధిత, ఇతర అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోయారు.

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సీతారాం ఏచూరిని ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. అప్పటి నుంచి వెంటిలెటర్‌పైనే ఆయన చికిత్స పొందుతున్నారు. 25 రోజులుగా ట్రీట్‌మెంట్లో ఉన్న ఆయన.. ఈరోజు కన్నుమూశారు. 72 ఏళ్ల సీతారాం ఏచూరికి ఇటీవలే క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా అయింది. అయితే.. ఇన్‌ఫెక్కషన్ పోయేందుకు వినియోగించిన మందులు ఫలితాలనివ్వలేదు. దాంతో జపాన్ దేశం నుంచి కూడా ప్రత్యేక మెడిసిన్ తెప్పించారు. అయినప్పటికీ అవి కూడా పనిచేయకపోవడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. దీంతో దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

సీతారం ఏచూరి 1952లో చెన్నైలో జన్మించారు. ఆయన పూర్తిపేరు ఏచూరి సీతారామారావు. 1975లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయన స్వస్థలం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ. పదో తరగతి వరకు ఆయన హైదరాబాద్‌లో చదివారు. ఆ తరువాత ఢిల్లీ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ హానర్స్ చేశారు. జేఎన్‌యూ విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు వరుసగా ఎన్నికయ్యారు. 1985లో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్‌గా సెలక్ట్ అయ్యారు. ఆ తరువాత 1999లో పొలిట్ బ్యూరోలో ఆయనకు చోటు లభించింది. 2005లో తొలిసారి బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కాగా.. 2015, 2018,2022లో మూడుసార్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

Tags:    

Similar News