ఏపీలో దంతవైద్యులపై డీసీఐ ఆసక్తికర అప్ డేట్!
అవును... ఏపీలో దంత వైద్యులు అవసరానికి మించి ఉన్నారని చెబుతోంది డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.
ప్రస్తుతం ఏపీలో దంద వైద్యులు అవసరానికి మించి ఉన్నారనే విషయాన్ని తాజాగా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీఐ) తెలిపింది. ఈ క్రమంలో వీరి సంఖ్య భారీగా ఉండటంతో... ఇక ఏపీలో కొత్త డెంటల్ కాలేజీలు వద్దని చెబుతోంది డీసీఐ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు మించి ఏపీలో దంతవైద్యులు ఉన్నారని డీసీఏ చెబుతున్న వేళ ఏపీ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను తాజాగా వెల్లడించింది.
అవును... ఏపీలో దంత వైద్యులు అవసరానికి మించి ఉన్నారని చెబుతోంది డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇందులో భాగంగా... ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతీ 7,500 మంది జనాభాకు ఒక డెంటల్ వైద్యుడు మాత్రమే ఉండాలని.. అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో ప్రతీ 2,524 మందికి ఒక దంత వైద్యుడు ఉన్నాడని.. ఇది చాలా ఎక్కువని డీసీఐ చెబుతుందని తెలుస్తుంది!
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 17 డెంటల్ కళాశాలలు ఉన్నాయన్ని.. అందువల్ల ఇక కొత్త దంత వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన ధృవీకరణ పత్రాలు ఇవ్వొద్దని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదే సమయంలో... డెంటల్ కాలేజీలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు కావడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది.
ఫలితంగా... డెంటల్ కోర్సులు పూర్తిచేసిన వారు నిరుద్యోగులుగా మారుతున్నారని పేర్కొంది. ఇక, అంచనాల ప్రకారం... భారతదేశంలో ఒక దంత వైద్యుని సగటు సంపాదన ఏడాదికి రూ.5.5 - 6 లక్షల వరకూ ఉంటుందని తెలుస్తోంది. ఇక సదరు వైద్యుని అనుభవం, ప్రాక్టీస్ పద్దతిని బట్టి అది ఏడాదికి రూ.10 లక్షల వరకూ ఉండొచ్చని అంటున్నారు.
మరోపక్క గత ఏడాది నివేధికల ప్రకారం... గత ఐదు సంవత్సరాలుగా భారతీయ ఇనిస్టిట్యూట్ లలో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డెంటల్ కోర్సుల్లో సుమారు 10 నుంచి 55 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక లోని ప్రైవేటు డెంటల్ కాలేజీలు ఎక్కువగా దెబ్బతిన్నాయని చెబుతున్నారు!