హైదరాబాద్ పోలీస్ కమీషనర్ క్షమాపణలు... కారణం ఇదే!

దీంతో.. ఈ వ్యాఖ్యలు అక్కడున్న కొంతమంది జర్నలిస్టులు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో... సీవీ ఆనంద్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

Update: 2024-12-23 07:52 GMT

'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా శనివారం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం.. తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్.. పేర్లు ప్రస్థావించకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పడంతో ఒక్కసారిగా విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి.. అల్లు అర్జున్ వ్యవహారశైలిపై కీలక వ్యాఖ్యలు చేస్తూ.. చట్టం ముందు అంతా సమానమేనని పునరుద్ఘాటించారు. మరోపక్క.. అసలు సంధ్య థియేటర్ వద్ద ఏమి జరిగిందో తెలుపుతూ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు.

అనంతరం.. ఏసీపీ, చిక్కడపల్లి సీఐ లు చెప్పిన విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సమయంలో సీవీ ఆనంద్ ని మీడియా కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... నేషనల్ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తుందని అన్నారు. అయితే... తాజాగా సారీ చెప్పారు.

అవును.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి మీడియా సంధించిన ప్రశ్నలకు స్పందించిన చీపీ సీవీ ఆనంద్... ఈ ఘటనకు నేషనల్ మీడియా మద్దతు ఇస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు అక్కడున్న కొంతమంది జర్నలిస్టులు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో... సీవీ ఆనంద్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

ఇందులో భాగంగా... ప్రెస్ మీట్ లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో తాను కాస్త సహనం కోల్పోయానని.. పరిస్థితులు ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుందని.. అయితే తాను చేసింది పొరపాటుగా భావిస్తున్నట్లూ చెబుతూ.. నేషనల్ మీడియాపై తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటూ.. క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.

మరోవైపు... సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మీడియా డిగిన పలు ప్రశ్నలకు సీపీ సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోను విడుదల చేశారు.

Tags:    

Similar News