అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసు.. నిందితులు ఆ విధంగా బెయిల్...!
అల్లు అర్జున్ ఇంటివద్ద ఆందోళన కేసులో అరెస్టైన ఓయూ జేఏసీ నేతలకు బెయిల్ మంజూరైంది.
సంధ్య థియేటర్ లో పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి సాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నేతలు ఆదివారం అల్లు అర్జున్ ఇంటిపై దాడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసం చేశారన్ని.. టమాటాలు విసిరారని అంటున్నారు.
ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారనీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. అల్లు అర్జున్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు! ఇందులో భాగంగా... బీ.ఎన్.ఎస్. సెక్షన్ 126(2), 131, 190, 191(2), 292, 324(2), 331(5) కింద కేసులు నమోదవ్వగా...తాజాగా వారికి బెయిల్ మంజూరైంది!
అవును... అల్లు అర్జున్ ఇంటివద్ద ఆందోళన కేసులో అరెస్టైన ఓయూ జేఏసీ నేతలకు బెయిల్ మంజూరైంది. వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో ఆరుగురు నిందితులను జూబ్లిహిల్స్ పోలీసులు హాజరుపరచగా.. వారికి న్యాయమూర్తి బెయిల్ మంజూరూ చేశారు. ఈ సందర్భంగా.. ఒక్కొక్కరూ రూ.10 వేలు, రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు!
కాగా.. ఆదివారం నాడు జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటివద్దకు చేరుకున్న ఓయూ జేఏసీ నాయకులు ఫ్లకార్డులు చేతపట్టుకుని అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా.. ఇంటి లోపలికి టమటాలు విసిరారు.. గోడ దూకి వెళ్లి పూల కుండీలను పగులగొట్టారు.. అనేవి అభియోగాలు అని అంటున్నారు.
మరోవైపు.. ఆదివారం నాడు అల్లు అర్జున్ ఇంటివద్ద దాడి నేపథ్యంలో.. అక్కడ భద్రత పెంచారని అంటున్నారు. ఇదే సమయంలో.. నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడినవారికి ఇవాల బెయిల్ లభించడంతో వారి కదలికలపైనా పోలీసులు నిఘా పెట్టబోతున్నారని తెలుస్తోంది.