మూడు గంటలపాటు చర్చలు...డిన్నర్ మీటింగ్ వెరీ ఇంటరెస్టింగ్

దీని కంటే ముందు ఇటీవలే చంద్రబాబు ఇంట్లో పవన్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కి అటెండ్ అయ్యారు.

Update: 2024-01-14 03:34 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తన ఇంటికి డిన్నర్ కి ఆహ్వానించారు. ఇద్దరూ సంక్రాంతి శుభ వేళను ముంగిట్లో పెట్టుకుని ఆనందంగా డిన్నార్ చేశారు. దీని కంటే ముందు ఇటీవలే చంద్రబాబు ఇంట్లో పవన్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కి అటెండ్ అయ్యారు.

ఇలా చూస్తే కనుక కేవలం వారం రోజుల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి రెండు సార్లు వెళ్ళి ఆయన ఇంట్లో అతిధిగా విందారగించారు అన్న మాట.ఇక శనివారం పొద్దుపోయిన తరువాత బాబు ఇంటికి పవన్ వచ్చారు వీకెండ్ పార్టీగా దీన్ని చూడవచ్చు. అలాగే రాజకీయాల్లో ఇలాంటి డిన్నర్ పార్టీలను చాలా స్పెషల్ గా చూడవచ్చు. మరో వైపు చూస్తే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి వేళ ఇచ్చే విందు అనుకోవచ్చు.

ఏది ఏమైనా ఈ ఇద్దరు నేతలు కలిశారు. మరి కొద్ది రోజులలో ఎన్నికలు ఉన్న వేళ బాబు పవన్ కలవడం అంటే రాజకీయంగా వెరీ స్పెషల్ గానే చూడాలి. ఇద్దరు నేతలూ కలసి మూడు గంటల పాటు కీలక చర్చలు జరిపారు అని అంటున్నారు. ఈ చర్చలలో ఉమ్మడి మ్యానిఫేస్టోని తొందరలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు అని తెలుస్తోంది.

అదే విధంగా ఇద్దరు నేతలూ కలసి అభ్యర్ధుల తొలి జాబితాను కూడా రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. టీడీపీ సూపర్ సిక్స్ హామీలు అలాగే జనసేన షణ్ముఖ పధకం కలిపి పన్నెండు హామీలతో ఉమ్మడి మ్యానిఫేస్టో రిలీజ్ అవుతుంది అని అంటున్నారు. ఇక బీజేపీ కూటమిలో చేరిక అన్నది లాభమా నష్టమా అన్నది కూడా కూడా చర్చించారు అని అంటున్నారు.

అంతే కాదు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున బయటకు వస్తున్న నేతలు అంతా జనసేన టీడీపీలలో చేరుతున్నారు. వారిని ఎలా తీసుకోవాలి, సీట్ల సర్దుబాటు వంటి వాటి విషయంలో చర్చించారు అని అంటున్నారు. ఇక తొందర్లోనే టీడీపీ జనసేన తొలి జాబితాలు వెలువడతాయని అంతున్నారు. ఈ చర్చలలో టీడీపీ నుంచి నారా లోకేష్ జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

Tags:    

Similar News