"వారి భార్యల ప్రేమికుల ఓట్లు నాకే"... హారిస్ టీమ్ పై ట్రంప్ దాడి!

అవును... యూఎస్ వైస్ ప్రెసిడెంట్, డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రచారానికి మద్దతు కూడగట్టడానికి ప్రారంభించబడిన "వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్" గ్రూపుపై కీలక వ్యాఖ్యలు చేశారు

Update: 2024-10-20 04:18 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారంలో దూకుడు పెంచుకుతున్నారు మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో తాజాగా న్యూయార్క్ లో ఆల్ స్మిత్ ఛారిటీ వార్షికోత్సవ డిన్నర్ లో పాల్గొని ప్రసంగించారు! ఈ సందర్భంగా "వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్" గ్రూపుపై మాటల దాడి చేస్తూ.. వెటకారం గుప్పించారు.

అవును... యూఎస్ వైస్ ప్రెసిడెంట్, డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రచారానికి మద్దతు కూడగట్టడానికి ప్రారంభించబడిన "వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్" గ్రూపుపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. నవంబర్ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై ఈ గ్రూపు ప్రభావాన్ని ఆయన తోసిపుచ్చారు.

ఇందులో భాగంగా... "నేను వారి (వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్) గురించి ఏమాత్రం చింతించడం లేదు. ఎందుకంటే.. వారి భార్యలు, వారి భార్యల ప్రేమికులు అందరూ నాకే ఓటు వేస్తున్నారు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో... ఇవి ట్రంప్ వంకర వ్యాఖ్యలు అని కొంతమంది అంటే... ట్రంప్ మార్కు వెటకారం అని మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు!

కాగా... "వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్" గ్రూపు కమలా హారిస్ ప్రచారానికి మద్దతును కూడగట్టడానికి ప్రారభించబడింది. ప్రధానంగా... ట్రంప్ మార్కు రాజకీయాల నుంచి డిస్ కనెక్ట్ అయిన శ్వేతజాతీయులను లక్ష్యంగా చేసుకుంటూ ఈ గ్రూపు కార్యచరణ కొనసాగుతోంది. దీని వ్యవస్థాపకుడు రాస్ మోరల్స్ రాకెట్టో.

తాజాగా ఆయన చెప్పిన లెక్కల ప్రకారం... ఈ టీమ్ ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 2,00,000 మంది పురుషులతో ఉంది. ప్రధానంగా కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిచిగాన్ వంటి చోట్ల ట్రంప్ పాలనలో విసిగిన శ్వేతజాతీయ పురుష ఓటర్లను ఈ టీమ్ లక్ష్యంగా చేసుకుందని అంటున్నారు!

ఎన్నికల్లో ఈ టీమ్ కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ఈ టీమ్ పై డొనాల్డ్ ట్రంప్ తనదైన అక్కసుని వెటకారంతో మేళవించి చెప్పారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News