ఫుల్ గా తాగి 108కి ఫోన్ చేశాడు... డ్రాపింగ్ కోసమంట!

అవును... ఫుల్ గా మధ్యం సేవించిన ఒక వ్యక్తి 108 అంబులెన్స్ కు అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేశాడు. దీంతో వారు హుటాహుటిన అతడు చెప్పిన దగ్గరకు వచ్చారు.

Update: 2024-02-01 15:00 GMT

"108" అనేది ఎంత గొప్ప ఆలోచన అనేది అందరికీ తెలిసిందే. ప్రమాదంలో ఉన్నవారు ఒక్క ఫోన్ చేస్తే వెంటనే వచ్చి సమస్య ఉన్న చోట వాలిపోతుంటుంది ఆ వాహనం. అనంతరం ప్రమాదంలో ఉన్నవారికి ప్రథమచికిత్స చేస్తూనే సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుంటుంది! అయితే అంతటి అత్యవసరమైన, అతిప్రాముఖ్యమైన వాహనానికి ఫుల్ గా తాగి ఫోన్ చేశాడు ఒక "పెద్ద మనిషి"! దీంతో... హుటాహుటున అక్కడికి చేరుకున్న 108 సిబ్బందితో ఏదేదో మాట్లాడటం మొదలుపెట్టాడు!!

అవును... ఫుల్ గా మధ్యం సేవించిన ఒక వ్యక్తి 108 అంబులెన్స్ కు అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేశాడు. దీంతో వారు హుటాహుటిన అతడు చెప్పిన దగ్గరకు వచ్చారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత అతడిని చూసిన 108 సిబ్బందికి షాక్ తగిలినంత పని అయ్యింది!! తమ కెరీర్ లో ఎన్నో ఎమర్జెన్సీ కాల్స్ ని చూసిన వారికి.. ఇతగాడి పెర్ఫార్మెన్స్ చూశాక బుర్ర గుర్రున తిరిగిందని అంటున్నారు!!

ఈ సందర్భంగా "ఎందుకు ఫోన్ చేశారు?" అని అడిగిన 108 సిబ్బందికి షాకింగ్ సమాధానం చెప్పాడు సదరు మందుబాబు! ఇందులో భాగంగా... "హైదరాబాద్ నుంచి జనగాం వెళ్లాలి.. నడవలేకపోతున్నా.. బస్సులు కూడా లేవు.. నన్ను జనగాంలో దించండి.. నేను అన్ కాన్షియస్ అయిపోతున్నా" అంటూ చెప్పుకొచ్చాడు. "మీకు అర్ధమవ్వడం లేదు సర్... నేను అన్ కాన్షియస్ అయిపోతున్నా" అంటూ రెట్టించడం మొదలుపెట్టాడు!

ఈ సమయంలో "మరి నిన్ను హాస్పటల్ కి తీసుకుని వెళ్లాలా?" అని అడిగిన 108 సిబ్బందికి దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. ఇందులో భాగంగా.. "ఆస్పత్రికి వద్దు కాస్త జనగాంలో దింపండి" అని చెప్పుకొచ్చాడు ఈ మందుబాబు. పైగా తనది కూడా ఎమర్జెన్సీ పరిస్థితే అని రెట్టించడం మొదలుపెట్టాడు. అంబులెన్స్ ఉన్నది ఎమర్జెన్సీకి అని 108 సిబ్బంది చెబుతుంటే... తనది కూడా ఎమర్జెన్సీనే అని సదరు బాబు చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.



Tags:    

Similar News