లక్షల ఓట్లు రద్దు చేసిన ఈసీ... వైసీపీ టీడీపీ ఓకేనా...!?
రాజకీయాలు అంటే వ్యూహాలే ఉంటాయి. అలాగే ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. ఏపీలో నకిలీ ఓట్లు దొంగ ఓట్లు అని అధికార వైసీపీ విపక్ష టీడీపీ పదే పదే విమర్శలు చేసుకున్నాయి.
రాజకీయాలు అంటే వ్యూహాలే ఉంటాయి. అలాగే ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. ఏపీలో నకిలీ ఓట్లు దొంగ ఓట్లు అని అధికార వైసీపీ విపక్ష టీడీపీ పదే పదే విమర్శలు చేసుకున్నాయి. రెండు పార్టీలూ కలసి కేంద్ర ఎన్నికల సంఘం వద్ద సీరియస్ గానే ఫిర్యాదులు చేశాయి.
దాని ఫలితంగా ఈసీ కూడా క్లోజ్ గా మోనిటరింగ్ చేసింది. ఏపీలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయని గమనించిన ఈసీ ఏకంగా అయిదు లఖల అరవై వేల ఓట్లను ఒక్క కలం పోటుతో రద్దు చేసి పారేసింది. ఇది నిజంగా వెరీ సీరియస్ డెసిషన్ గానే చూస్తున్నారు.
మరి ఇంత పెద్ద ఎత్తున నకిలీ నోట్ల పేరుతో ఓట్లను తొలగించిన మీదట ప్రధాన పార్టీలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయా తమ ఫిర్యాదుని ఈసీ గట్టిగానే తీసుకుని మంచి యాక్షన్ కి దిగింది అని అనుకుంటున్నాయా అంటే చూడాల్సి ఉంది
గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే ఏ పార్టీ ఇక్కడ తక్కువ కాదు అని అంటున్నారు. ఆ విధంగా ఎవరికి తోచిన తీరున వారు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చేయాల్సినవి అన్నీ చేశారు అని అంటున్నారు. ఇక ఈసీ కూడా ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని చెబుతూ పకడ్బంధీగా యాక్షన్ కి దిగింది అని అంటున్నారు.
దాని ఫలితమే ఏపీలో లక్షలలో ఓట్లు రద్దు అని అంటున్నారు. ఇప్పటిదాకా పలు రాష్ట్రాలలో ఎన్నికలు అసెంబ్లీకి జరిగాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు మాత్రం రద్దు అయిన సందర్భాలు లేవని అంటున్నారు. ఏపీలో రెండూ ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. రెండింటికీ మంచి పోటీ ఉంది. ఎక్కడా ఎవరూ తగ్గేది లేదు అన్నట్లుగా ఉంటారు.
అందుకే సామ దాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగిస్తున్నారు. ఈసీ ముందు ఫిర్యాదులు ఒకరి మీద ఒకరు చేసుకున్నారు. కానీ తీరా ఈసీ రంగంలోకి దిగి దొంగ ఓట్లు ఇన్ని లక్షలు అని తేల్చిన తరువాత మాత్రం ఏపీలో రాజకీయం సైలెంట్ గా మారింది అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే ఈసీ ఏపీ మీద చాలా నిశిత పరిశీలన చేస్తూ ఎన్నికలను నిర్వహించబోతోంది అని అంటున్నారు. రానున్న రోజులలో కూడా ఇదే తీరుగా ఉంటుందని అంటున్నారు. ఏపీలో ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితా చూసుకుంటే కనుక మొత్తం 4.08 కోట్ల ఓటర్లు ఉన్నట్లుగా ఈసీ లెక్క తేల్చింది.
ఇక ఈసీ గతేడాది అక్టోబర్ 27న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసిన తర్వాత మొత్తం 5.08 లక్షల ఓటర్లు పెరిగినట్లు సీఈవో ముకేష్ కుమార్ వెల్లడించారు. ఇందులో 5 లక్షల మంది యువ ఓటర్లే ఉన్నారన్నారు. రేపటి నుంచి రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్శిటీల్లో కొత్త ఓటర్ల నమోదు కూడా చేపట్టనున్నారు. కొత్త ఓటర్లు ఏపీలో కలుపుకుంటే కనుక ఈసారి నలభై నుంచి యాభై లక్షల దాకా అదనంగా ఉండవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో లక్షలలో దొంగ ఓట్లు ఉన్నాయని ఈసీ యాక్షన్ తో తేలినట్లు అయింది.