జాగ్రత్తగా వ్యవహరించాలి.. చంద్రబాబుకు హెచ్చరిక!

తమ స్థాయి మరిచి, ప్రత్యర్థుల స్థాయి మరిచి పలువురు నేతలు చేస్తున్న విమర్శలు వైరల్ గా మారుతున్నాయి.

Update: 2024-05-07 03:39 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో పోలింగ్ తేదీ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచారం తీవ్రతరమౌతోన్న సంగతి తెలిసిందే. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ సందర్భంగా నేతల మధ్య మాటల యుద్ధాలు పీక్స్ కి చేరుతున్నాయి. వ్యక్తిగత ఆరోపణలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. తమ స్థాయి మరిచి, ప్రత్యర్థుల స్థాయి మరిచి పలువురు నేతలు చేస్తున్న విమర్శలు వైరల్ గా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై... ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. కొన్ని సందర్భాల్లో రాయలేని స్థాయిలో విమర్శలు చేస్తుండటం గమనార్హం. నిన్న మొన్నటివరకూ సైకో అంటూ విమశలు చేసిన బాబు.. ఈసారి ఇంకా దారుణంగా విరుచుకుపడుతున్నారు! ఈ సమయంలో ఈసీ స్పందించింది.

అవును... సీఎం వైఎస్ జగన్ పై చంద్రబాబు చేసిన విమర్శలపై కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది! తన ప్రసంగాల్లో ప్రయోగించిన భాష, వాడిన పదాల పట్ల ఆగ్రహించింది! ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు స్పష్టం చేసింది! జగన్‌ ను సైకోగా చంద్రబాబు అభివర్ణించడాన్ని ఈసీ తప్పు పట్టింది!

"ఆ సైకో చెబితే ఈ సైకో ఎగురుతున్నాడు.. నేను అనుకుంటే నీ తోక కట్ చేయడానికి ఒక్క నిమిషం చాలు.. శ్రీరాముడు రావణాసురుడిని చంపాడు, మీరేం చేయాలి? జగనాసురుడిని ఏం చేస్తారు.. మీరు..?" అంటూ గతంలో చంద్రబాబు విమర్శించారు! దీంతో ఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీఈసీ సీరియస్ అయ్యింది. బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ ఇచ్చింది!

కాగా... ఏప్రిల్ 6న పెదకూరపాడు.. 10న నిడదవోలు, తణుకు.. 11న అమలాపురం.. 15న పలాస.. 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి చంద్రబాబు తీవ్ర పదజాలంతో మాట్లాడారు!

Tags:    

Similar News