లైవ్‌ అప్‌డేట్స్‌ - 50 వేల ఓట్ల ఆధిక్యంలో పవన్‌ కల్యాణ్‌!

Update: 2024-06-04 02:23 GMT
  1. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

ఆధిక్యం గెలిచినవి

వైఎస్ఆర్సీపీ

16

0

టీడీపీ+జనసేన+బీజేపీ

159

0

ఇతరులు

0

0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోకసభ

ఆధిక్యం గెలిచినవి

వైఎస్ఆర్సీపీ

4

0

టీడీపీ+జనసేన+బీజేపీ

21

0

ఇతరులు

0

0

తెలంగాణ లోకసభ

ఆధిక్యం గెలిచినవి

బీజేపీ

8

0

కాంగ్రెస్

8

0

బీఆర్ఎస్

0

0

ఇతరులు

1

0

భారత్ లోకసభ

ఆధిక్యం గెలిచినవి

NDA

298

0

INDIA

226

0

Others

19

0

ఎన్నికల ఫలితాలు 2024 లైవ్‌ అప్డేట్స్


  • 50 వేల ఓట్ల ఆధిక్యంలో పవన్‌ కల్యాణ్‌!-ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అత్యంత ఆసక్తికరమైన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా... పిఠాపురంలో 11 రౌండ్లు ముగిసే సమయానికి 50,671 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో రెండో విజయమూ టీడీపీదే!-ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే తొలి విజయం రాజమండ్రి రూరల్ నుంటి టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి రూపంలో తొలి విజయం నమోదు కాగా.. రెండో విజయమూ టీడీపీ పార్టీ నమోదు చేసింది. ఇందులో భాగంగా.. రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి మాగంటి భరత్‌ రామ్‌ పై 55వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • ఏపీ ఎన్నికల్లో టీడీపీ తొలి విజయం నమోదు!-ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కౌంటింగ్ స్టార్ట్ అవ్వగానే తొలి మెజారిటీ సాధించిన రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి... తొలి విజయం నమోదు చేశారు. ఇందులో భాగంగా... రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 63,056 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
  • రాయలసీమలో సైకిల్ జోరు.. కూటమి హుషారు!-2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాయలసీమలోని 51 స్థానాల్లోనూ 49 స్థానాల్లో గెలిచిన వైసీపీ... ఈసారి మాత్రం పూర్తిగా వెనుకబడినట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగా తాజా ఎన్నికల్లో రాయలసీమలో సైకిల్ జోరు కొనసాగుతుంది. ఇందులో భాగంగా... 51 స్థానాల్లోనూ 41 చోట్ల కూటమి అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. దీంతో... భారీ మెజారిటీ దిశగా కూటమి దూసుకువెళ్తుంది!
  • కడప పార్లమెంట్ ‎లో వైఎస్ షర్మిల ముందంజ!-ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ రౌండ్ రౌండ్ కీ టెన్షన్ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో... కడప లోక్ సభ నియోజకవర్గంలో వైఎస్ అవినాష్ రెడ్డిపై వైఎస్ షర్మిల ముందంజలో ఉన్నారు.
  • వెనుకంజలో అల్లు అర్జున్ ఫ్రెండ్!-ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ సందర్భంగా కీలక పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కూటమి అభ్యర్థులు రికార్డ్ స్థాయిలో ఆధిక్యంలో దూసుకుపోతుండగా... అల్లూ అర్జున్ ప్రచారం చేసిన, వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. ఇందులో భాగంగా... రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి శిల్పా రవికి 17,385 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి మహ్మద్ ఫరూక్ కు 22,613 ఓట్లు వచ్చాయి. అంటే... శిల్పా రవిచంద్రా రెడ్డి సుమారు 5,228 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
  • ఖమ్మంలో రఘురామ్‌ రెడ్డి, మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఆధిక్యం!-తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జోరుగా సాగుతుంది. ఈ సందర్భంగా కీలకమైన ఖమ్మం, మల్కాజిగిరీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా... ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామ్‌ రెడ్డి 1,48,091 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా... మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1,05,472 ఆధిక్యంలో ఉన్నారు.ఇదే సమయంలో మెదక్‌ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు (1731), మహబూబ్‌ నగర్‌ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ (5,652), కరీంనగర్ లో బండి సంజయ్ (64,408), నిజామాబాద్‌ లో ధర్మపురి అర్వింద్ (17,832) ఆధిక్యం ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • 2019 రివర్స్!... 151 టీడీపీ - 24 వైసీపీ!? ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందడి నెలకొంది. ఈ రోజు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఏపీలో టీడీపీ వేవ్ కనిపిస్తుంది. ఇందులో భాగంగా 2019లో వైసీపీ 151 స్థానాల్లో గెలుపొందగా.. టీడీపీ 23 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ప్రస్తుతం టీడీపీ 151 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. వైసీపీ కేవలం 24 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతుండటం గమనార్హం. ఈ వేవ్ ఇలానే కంటిన్యూ అయితే... 2019లో వైసీపీ సాధించిన సీట్లకంటే ఎక్కువ ఈసారి కూటమి గెలుచుకునే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.
  • కుప్పంలో చంద్రబాబుకు గట్టిపోటీ ఇస్తున్న భరత్!-ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న వేళ... ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా... రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అనుకూల పవనాలు వీస్తున్నట్లు ఉన్న నేపథ్యంలో... కుప్పంలో మాత్రం చంద్రబాబుకు వైసీపీ అభ్యర్థి భరత్ గట్టిపోటీ ఇస్తున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో... ఉదయం 10:15 నిమిషాలకు అందిన సమాచారం ప్రకారం.. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు 5662 ఓట్లు సాధించగా.. భరత్ కు 4769 ఓట్లు పోలయ్యాయి!
  • కౌంటింగ్ కేంద్రంనుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వంశీ!-ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా జరుగుతుంది. ప్రస్తుతం వస్తున్న ఫలితాలు ఏపీలో వార్ వన్ సైడ్ అన్నట్లుగానే పరిస్థితి ఉంది. ఈ సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పలువురు వైసీపీ నేతలు.. అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోవడం ఆసక్తికరంగా మారింది.ఇందులో భాగంగా ఇప్పటికే రాజమండ్రిలో మార్గాని భరత్, గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ లు కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారని తెలుస్తుంది.
  • ప్రస్తుతానికి జగన్‌, బొత్స సేఫ్!-ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో మంత్రులు, కీలక నేతలకు బిగ్ షాక్స్ తగులుతున్నాయి. వైసీపీలోని కీలక నేతలంతా వెనుకబడి ఉన్నారు. ఇందులో భాగంగా... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), బుగ్జన రాజేంద్రనాథ్‌ (డోన్‌), రోజా (నగరి), అంబటి రాంబాబు (సత్తెనపల్లి), గుడివాడ అమర్నాథ్‌ (గాజువాక), కొడాలి నాని (గుడివాడ), వల్లభనేని వంశీ (గన్నవరం) వెనుకంజలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని మంత్రులంతా దాదాపు వెనుకంజలో ఉన్నారని తెలుస్తుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి బొత్సా సత్యనారాయణ మినహా మిగిలినవారంతా ప్రస్తుతానికి వెనుకంజలో ఉన్నారని సమాచారం!
  • కడపలో వైసీపీకి బిగ్ షాక్!-ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందడి నెలకొంది. ఇందులో భాగంగా... ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు బిగ్ షాక్ తగిలింది. కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మాధవీ రెడ్డి 10,000 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. ఇదే సమయంలో... ప్రొద్దుటూరు, రాయచోటీలోనూ టీడీపీ అభ్యర్థులు లీడింగ్ లో కొనసాగుతున్నారు.
  • రాజమండ్రి సిటీ: కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన మార్గాని భరత్ ,రాజమండ్రి రురల్:మొత్తం 20 రౌండ్లలో 7 రౌండ్ల కౌంటింగ్ పూర్తి... బుచ్చయ్య చౌదరి 21631 ఓట్ల మెజారిటీ
  • వారణాసిలో నరేంద్ర మోడీ వెనుకంజ!-దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యింది. ఉదయం 8 గంటల నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల సందడి నెలకొంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి ముందంజలో ఉన్నప్పటికీ... వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ వెనుకంజలో ఉన్నారు.మరోపక్క ఎన్డీయే కూటమి 277 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... ఇండియా కూటమి 210 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
  • ఏపీలో మంత్రులు, కీలక నేతలు వెనుకంజ!-ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకూ వచ్చిన ఫలితాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉంది. ఈ సమయంలో వైసీపీ కీలక నేతలు, మంత్రులుగా పనిచేసిన వారు వెనుకంజలో ఉండటం గమనార్హం.ఇందులో భాగంగా... ఉషశ్రీ చరణ్ (పెనుగొండ), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), రోజా (నగరి), విడదల రజనీ (గుంటూరు వెస్ట్), అంబటి రాంబాబు (సత్తెనపల్లి), స్పీకర్ తమ్మినేని సీతారం (ఆముదాలవలస), కొడాలి నాని (గుడివాడ), వల్లభనేనిఉ వంశీ (గన్నవరం) వెనుకంజలో ఉన్నారు.
  • మంగళగిరిలో ఆధిక్యంలో నారా లోకేష్-ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ మొదలైంది. ఇందులో భాగంగా... ఇప్పటికే టీడీపీ కూటమి సుమారు 50 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇదే సమయంలో మంగళగిరిలో నారా లోకేష్ 2,422 ఓట్ల ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా... పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు ఆధిక్యం, సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి విజయ్‌ కుమార్‌, గురజాలలో టీడీపీ అభ్యర్థి యరపతినేని ముందంజలో కొనసాగుతున్నారు.
  • పిఠాపురంలో పవన్‌ కల్యాణ్ 4350 ఓట్ల ఆధిక్యం-జనసైనికులు ముందునుంచీ చెబుతున్నట్లుగ పిఠాపురంలో పవన్ కల్యాణ్ రికార్డ్ స్థాయి మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఫలితాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా... మొదటి రౌండు ముగిసేసరికి పిఠాపురం జనసేన అభ్యర్థి పవన్‌ కల్యాణ్ 4350 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఇదే సమయంలో పోస్టల్ బ్యాలెట్ 3వ రౌండ్‌ లో రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 5వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • కడపలో ఆధిక్యంలో ఎంపీ అభ్యర్థి అవినాష్‌ రెడ్డి కడప లోక్ సభ స్థానంలో వైసీపీ తరుపున పోటీ చేసిన అవినాష్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డికి 4362 ఓట్లు పోలవ్వగా.. భూపేష్ రెడ్డి 2088, వైఎస్ షర్మిళ 1101 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
  • పిఠాపురంలో ఆధిక్యంలో పవన్ కల్యాణ్... దూసుకుపోతున్న కూటమి!జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో అత్యంత హాట్ టాపిక్ గా నిలిచిన పిఠాపురం నియోజకవర్గంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ విధంగా... కూటమి అభ్యర్థులు సుమారు 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఇందులో భాగంగా... రాజమండ్రి రూరల్, నెల్లూరు సిటీ, పాన్యం, గజపతి నగరం, కుప్పం, పూతలపట్టు, గంగాధర్ నెల్లూరు, పిఠాపురం స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఈ క్రమంలో.. మూడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో కనిపిస్తుంది. ఇందులో భాగంగా...      రాజమండ్రి రూరల్ - బుచ్చయ్య చౌదరి, నెల్లూరు సిటీ - నారాయణ, పాణ్యం - గౌరు చరితా రెడ్డి, కుప్పం - చంద్రబాబులు ఆధిక్యంలో ఉన్నారు.
  • కరీంనగర్ లో ఆధిక్యంలో బండి సంజయ్! - తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలైంది. ఈ సమయంలో... కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కు పోస్టల్ బ్యాలెట్ లో మెజారిటీ ఓట్లు పోలయ్యాయి.
  • ఆధిక్యంలో బుచ్చయ్య చౌదరి!......ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఇందులో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమైంది. ఇక ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ రౌండ్ లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజు వచ్చేసింది. ఇందులో భాగంగా.. 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలైంది. ఈ సమయంలో... జాతీయ స్థాయిలో లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు.. ఏపీలోని అసెంబ్లీ - లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్ డేట్స్ మీకోసం...!!
Tags:    

Similar News