ట్రెండింగ్ లో చిన్నారి మస్క్... ప్రెసిడెంట్ ట్రంప్ తోనే సపర్యలా?
ఎలాన్ మస్క్ కుమారుడు మరోసారి ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించాడు. ఇందులో భాగంగా... అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ గార్డెన్ లో ఈ చిన్నారితో కలిసి డొనాల్డ్ ట్రంప్ నడుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.;
డొనాల్డ్ ట్రంప్ 2.0 లో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అత్యంత కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి ప్రెసిడెంట్ ట్రంప్ ను కలిశారు. వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో వీరిద్దరూ మీడియా సమావేశంలో పాల్గొన్న సమయంలోనూ.. మస్క్ కుమారుడు చేసిన అల్లరి నెట్టింట వైరల్ గా మారింది.
ఆ సమయంలో కాసేపు కింద నిలబెట్టి.. కాసేపు తన భుజాలపైన కూర్చోబెట్టుకుని తన కుమారుడితో మస్క్ చేసిన సందడి అంతా ఇంతా కాదు! దీనికి సంబంధించిన వీడియోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఎలాన్ మస్క్ నాలుగేళ్ల కుమారుడు ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించాడు. ఏకంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తోనే సపర్యలు చేయించుకుంటున్నాడు!
అవును... ఎలాన్ మస్క్ కుమారుడు మరోసారి ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించాడు. ఇందులో భాగంగా... అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ గార్డెన్ లో ఈ చిన్నారితో కలిసి డొనాల్డ్ ట్రంప్ నడుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. వీకెండ్ లో భాగంగా.. డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని తన నివాసానికి బయలుదేరారు. ఆయనతో పాటు ఎలాన్ మస్క్ కూడా వెళ్లారు.
ఈ సమయంలోనే.. వైట్ హౌస్ సౌత్ లాన్ లో పార్క్ చేసి ఉన్న హెలికాప్టర్ ఎక్కేందుకు ట్రంప్ వెళ్తుండగా.. ఆయన వెనకే ఎలాన్ మస్క్ కుమారుడు కూడా నడుస్తూ వచ్చాడు. ఈ సమయంలో హెలికాప్టర్ మెట్లు ఎక్కేందుకు జూనియర్ మస్క్ ఇబ్బంది పడుతుండగా.. స్వయంగా ట్రంప్ అతడిని పైకి ఎక్కించారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. హ్యాపీ పిక్చర్ అని రాసుకొచ్చారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ సమయంలో ట్రంప్ ను జూనియర్ మస్క్ “Grandpa Trump” అని పిలిచి ఉంటారంటూ ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.