మహిళా ఎస్సై పై కానిస్టేబుల్ అత్యాచారం... వీడియో తీసి దారుణం!
ఒక హోటల్ లో ఒక మహిళా సబ్-ఇనిస్పెక్టర్ పై అత్యా*చారం చేసి, ఆ దాడిని వీడియోలో చిత్రీకరించాడనే ఆరోపణలు ఉన్నాయి.;
మహిళకు ఏ ఒక్క చోటా రక్షణ ఉండటం లేదా..? అనే ప్రశ్నకు బలం చేకూర్చే ఓ ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఓ మహిళా సబ్ ఇనిస్పెక్టర్ పై కానిస్టేబుల్ అత్యాచారం చేసి.. ఆ సమయంలో వీడియోలూ తీసి.. అనంతరం ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడట. ఈ క్రమంలో... తాజాగా ఆమె ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో ఎఫ్.ఐ.ఆర్. నమోదైంది.
అవును... ఒక హోటల్ లో ఒక మహిళా సబ్-ఇనిస్పెక్టర్ పై అత్యా*చారం చేసి, ఆ దాడిని వీడియోలో చిత్రీకరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో.. నిందితుడు అస్లాం.. నేరం గురించి ఫిర్యాదు చేస్తే వీడియోలు సోషల్ మీడియాలో లీక్ చేస్తానని కూడా ఆమెను బెదిరించాడంట. అయితే.. తాజాగా ఆమె ఫిర్యాదుతో కేసు నమోదై, దర్యాప్తు జరుగుతోంది.
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరాఖండ్ లోని ఒక మహిళా ఎస్సై కొంతకాలంగా కొండప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత కారణాలతో ఆమె మైదాన ప్రాంతంలో పోస్టింగ్ కోరారు. దీంతో.. ఆమెను ఇటీవల డెహ్రాడూన్ కు బదిలీ చేశారు. ఈ క్రమంలో తన ఇంటికి స్టేషన్ కు దూరంగా ఉండటం వల్ల నగరంలోనే ఓ హోటల్ లో ఆ రోజు బస చేయాలని ఆమె నిర్ణయించుకుందట.
దీనికోసం తన సహోద్యోగి కానిస్టేబుల్ ను ఒక రూమ్ బుక్ చేయమని అడిగినట్లు ఆమె తెలిపింది. ఈ సమయంలో హోటల్ కు చేరుకున్న తర్వాత సదరు కానిస్టేబుల్.. ఆ మహిళా ఎస్సైపై బలవంతంగా అత్యాచారం చేశాడని ఆమె చెబుతున్నారు. ఈ సమయంలో మానసిక గాయంతో సతమవుతూ.. సెలవు తీసుకుని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.
అయితే... ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా తాను ఇంటికి కూడా చేరుకోలేకపోయినట్లు తెలిపిన ఆమె... తిరిగి విధుల్లోకి వచ్చిన తర్వాత కూడా.. నిందితుడు వీడియోను ప్రస్థావిస్తూ తనను బ్లాక్ మెయిల్ చేశాడని ఆమె తెలిపారు. ఈ సమయంలో ఇక భరించడం తన వల్లకాదని.. ధైర్యాన్ని కూడగట్టుకుని.. పై అధికారులకు ఫిర్యాదు చేశారు మహిళా ఎస్సై.
దీంతో... అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో నిందితుడైన కానిస్టేబుల్ పై బీ.ఎన్.ఎస్. చట్టంలోని 115(2), 126(1), 308, 351 (2), 351(3), 352, 64, 77, 78 సహా వివిధ సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ సింగ్... బాధితురాలు వైద్య పరీక్షలు చేయించుకుటోందని.. ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయడానికి దరఖాస్తును సమర్పించామని తెలిపారు. ఈ కేసును పర్యవేక్షించే బాధ్యతను ఆ ప్రాంత రూరల్ ఎస్పీకి అప్పగించారు.