వర్మను వదిలేస్తే.. కష్టమే: టీడీపీ హాట్ టాపిక్..!
పిఠాపురం వర్మగా పేరొందిన ఎస్‌వీఎస్ ఎన్ వర్మ.. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల రాజకీయాల్లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్త రాజకీయాల్లోనూ.. హాట్ టాపిక్‌గా మారారు.;
పిఠాపురం వర్మగా పేరొందిన ఎస్‌వీఎస్ ఎన్ వర్మ.. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల రాజకీయాల్లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్త రాజకీయాల్లోనూ.. హాట్ టాపిక్‌గా మారారు. పిఠాపురం నుంచి పోటీ చేయాలని అనుకుని కూడా చివరి నిమిషంలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారని.. ఆయన తన సీటును జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వదిలేశారు. అయితే.. ఆ తర్వాత.. కాలం నుంచి వర్మకు అనేక పరాభవాలు ఎదురవుతు న్నాయి. ఆయన కారుపై కొందరు దాడులు చేశారు.
అయితే.. ఈ దాడులు చేసిన వారు జనసేన కార్యకర్తలని తెలిసి కూడా.. అప్పట్లో వర్మ సర్దుకు పోయారు. ఆ తర్వాత కూడా.. ఆయనపై దాడులు జరిగాయి. అయినా.. మౌనంగానే ఉండిపోయారు. ఇవి క్షేత్రస్థాయి లో వర్మకు జరుగుతున్న అవమానాలు. ఇక, పదవుల పరంగా కూడా.. వర్మకు ఇప్పటి వరకు గుర్తింపు రాలే దు. ఇది మానసికంగా వర్మను వేధిస్తున్న ప్రధాన అంశం. అయినప్పటికీ.. ఆయన మౌనంగానే భరిస్తున్నా రు. ఈ పరిణామాలు.. ఆయన అనుచరులను కూడా వేధిస్తున్నాయి.
అయితే.. వర్మను టీడీపీ పట్టించుకుంటున్నట్టా? వదిలేసినట్టేనా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారిన టాపి క్. వచ్చే ఎన్నికల్లోనూ పవనే పిఠాపురం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. పిఠాపురంలో నిర్వహించిన ఆవిర్భావ సభ ద్వారా.. పవన్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు వర్మను టీడీపీ కాపాడుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. పైకి నిదానంగా కనిపిస్తున్నా.. వర్మకు జరుగుతున్న వరుస అవమానాలు క్షత్రియ సామాజిక వర్గంలోచర్చకు వస్తున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.
గత ఎన్నికల్లో టికెట్‌ను త్యాగం చేయడం.. పవన్‌కు కేటాయించడం ద్వారా.. క్షత్రియ సామాజిక వర్గంలో వర్మకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. కానీ, ఆయనకు అన్యాయం జరుగుతోందన్న చర్చ కూడా ఇప్పు డు సాగుతోందని, బలమైన ఓటు బ్యాంకు, పైగా సింపతీ కూడా సొంతం చేసుకున్న వర్మ విషయంలో సాధ్యమైనంత వేగంతో స్పందించి.. ఆయనను శాంతిప జేయకపోతే, క్షత్రియ సామాజిక వర్గంలో పార్టీ పలుచన అయ్యే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి