గతం మరిచిపోతున్న నాగబాబు.. ఏసేసుకుంటున్నారుగా...!
జనసేన నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా మారిన నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.;
జనసేన నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా మారిన నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం వెనుక ఎవరో ఉన్నారని అనుకుంటే అది వారి `ఖర్మ` అంటూ.. ఆయన పేరు చెప్పకుండానే.. టీడీపీ సీనియర్ నాయకుడు వర్మపై చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తు న్నాయి. వాస్తవానికి ఒక వివాదం కొన్ని గంటల్లో సమసి పోతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు.. కొన్ని గంటల్లోనే పరిష్కారం అవుతాయి.
కానీ, 24 గంటలు గడిచినా కూడా.. నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పిఠాపురంలో విజయం దక్కించుకున్న విష యం తెలిసిందే. అయితే.. అప్పట్లో ఈ టికెట్‌ను టీడీపీ నాయకుడు వర్మ త్యాగం చేశారు. ఆ సమయంలో వర్మ ఇంటికి వెళ్లిన పవన్ ఆయన మాతృమూర్తి నుంచి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. తనను గెలిపిం చే బాధ్యతను వర్మ చేతుల్లో పెడుతున్నానని బహిరంగ వేదికలపైనే చెప్పుకొచ్చారు.
కానీ... గతం నుంచి కూడా నాగబాబు వర్మను తక్కువ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. ఇక, ఇప్పుడు ఆయ న ఎమ్మెల్సీ అయిన తర్వాత.. స్వరం మరింత పెరిగింది. ఈ విషయాన్నే నెటిజన్లు.. ఎత్తి చూపుతున్నారు. పిఠాపురం ఎన్నికల సమయంలో వర్మ ఇంటింటికీ తిరిగి.. పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని కోరుతూ.. చేసిన అభ్యర్థనల తాలూకు వీడియోలను వైరల్ చేస్తున్నారు. అంతేకాదు.. అప్పట్లో పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు.. నాగబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. కానీ, నెటిజన్ల నుంచి మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాగబాబు.. పార్టీలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నా రని కొందరు నేరుగా అంటే.. మరికొందరు నాగబాబు వంటి వ్యక్తులు దారి తప్పితే.. ప్రమాదమని అంటు న్నారు. అయిపోయిన దానిని తవ్వుకుని.. ఇప్పుడు లేనిపోని రాజకీయ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.