రియల్ వీడియోస్: పాక్ హాస్టల్ లో మస్క్, కుల్ఫీ అమ్ముతోన్న ట్రంప్!
ఈ సమయంలో మస్క్ లాంటి వ్యక్తి తాజాగా పాకిస్థాన్ లో కనిపించి, నెట్టింట వైరల్ గా మారాడు.;
ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి! స్పేస్ ఎక్స్ అధినేత అయిన ఎలాన్ మస్క్.. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ 2.0 ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్నారని అంటున్నారు. డోజ్ సారథిగా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో మస్క్ లాంటి వ్యక్తి తాజాగా పాకిస్థాన్ లో కనిపించి, నెట్టింట వైరల్ గా మారాడు.
అవును... పాకిస్థాన్ లో ఓ వ్యక్తి సాధారణ భోజనం ఆస్వాధిస్తున్న వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఎలాన్ మస్క్ చిన్నప్పటి వెర్షన్ తో ఆ వ్యక్తి ఆల్ మోస్ట్ పూర్తి పోలిక కలిగి ఉన్నాడు. ఈ సందర్భంగా... ఎలాన్ మస్క్ డోపెల్ గేంజర్ ని చూడండి.. ఎలాన్ మస్క్ ఖాన్ యూసఫ్ జాయ్ అనే క్యాప్షన్ తో ఎక్స్ లో ఈ వీడియో పోస్ట్ అయ్యి, వైరల్ గా మారింది.
ఈ ఖాన్ యూసఫ్ జాయ్ ని చూసినవాళ్లు ఆల్ మోస్ట్ ఎలాన్ మస్క్ లానే ఉన్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. మనిషి పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారనే విషయాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రస్థావిస్తున్నారు. ఈ సమయంలో మస్క్ పోస్టుకు రియాక్ట్ అవుతూ.. డొనాల్డ్ ట్రంప్ ను పోలినట్లు ఉన్న వ్యక్తికి సంబంధించిన వీడియోను మరో నెటిజన్ పోస్ట్ చేశాడు.
తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసిన నెటిజన్... ఇతడు డొనాల్డ్ ట్రంప్ డాపెల్ గాంజర్ అని రాసుకొచ్చాడు. ఆ వీడియోలో.. ఓ వ్యక్తి ప్రత్యేకమైన పద్దతిలో కుల్ఫీ అమ్ముతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోకు.. డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ లో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు అని సరదాగా రాశాడు. ఇప్పుడు ఈ వీడియో కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది.
వాస్తవానికి ఎలాన్ మస్క్ ను పోలి ఉండే వ్యక్తులు ఆన్ లైన్ వేదికగా ప్రజల దృష్టిని ఆకర్షించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓసారి.. సల్వార్ కుర్తా ధరించి, అచ్చు ఎలాన్ మస్క్ లా ఉన్న వ్యక్తి పాకిస్థానీ లుక్ కు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో సోషల్ మీడియాలో కనిపించింది. అతడు కూడా అచ్చుగుద్దినట్లు ఎలాన్ మస్క్ లాగానే ఉన్నాడు!
దానికి క్యాప్షన్ గా... మెరుగైన కెరీర్ అవకాశాల కోసం అమెరికా వెళ్లడానికి ముందు పాకిస్థాన్ లోని మారుమూల గ్రామంలో ఎలాన్ మస్క్ ఎలక్ట్రీషియన్ గా పనిచేసేటప్పటి అరుదైన ఫోటో అని పేర్కొన్నారు. అయితే... కొంతమంది మాత్రం దీన్ని ఏఐ జనరేటెడ్ పిక్ గా అభిప్రాయపడ్డారు.