ఈ ఎమ్మెల్యే దేశంలోనే సూపర్ రిచ్... టాప్-10 లో నలుగురు ఏపీ వారే!

తాజాగా అత్యంత సంపన్నులైన ప్రజాసేవకుల జాబితా తెరపైకి వచ్చింది.;

Update: 2025-03-19 11:29 GMT

తాజాగా దేశంలోని ఎమ్మెల్యేల నేర, ఆర్థిక నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఎస్) ఓ నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... దేశంలోని 4,902 మంది ఎమ్మెల్యేల్లో 1,861 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. వారిలో 1,205 మందిపై తీవ్రమైన క్రిమినల్ అభియోగాలున్నాయని తెలిపింది. ఈ సమయంలో అర్థిక వివరాలు తెరపైకి వచ్చాయి.

అవును... దేశంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల నేర, ఆర్థిక నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఎస్) విశ్లేషిస్తున్న నేపథ్యంలో.. తాజాగా అత్యంత సంపన్నులైన ప్రజాసేవకుల జాబితా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ముంబైలోని ఘట్నోపర్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతినిధ్యం వహిస్తోన్న బీజేపీ నేత పరాగ్ షా అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా ఏడీఎస్ పేర్కొంది.

ఈ భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే ఆస్తులు సుమారు రూ.3,400 కోట్లు అని ఏడీఎస్ తెలిపింది. దీంతో.. ఈయన దేశంలోనే అత్యంత రిచ్ ఎమ్మెల్యే అని పేర్కొంది. ఇక రెండోస్థానంలో కర్ణాటకలోని కనకపుర ఎమ్మెల్యే, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ సుమారు రూ.1,413 కోట్లతో దేశంలోనే రెండో ధనిక ఎమ్మెల్యేగా ఉన్నారని ఏడీఎస్ తెలిపింది.

ఇదే సమయంలో వెస్ట్ బెంగాల్ లోని ఇండస్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా.. దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యేగా నిలిచారని ఏడీఎస్ తెలిపింది. ఎన్నికల అఫిడవిట్ లో ఆయన ప్రకటించిన ఆస్తులు కేవలం రూ.1,700 కావడం గమనార్హం!

అత్యంత ధనిక ఎమ్మెల్యేలలో గుర్తించదగ్గ వ్యక్తులు!:

కేహెచ్ పుట్టస్వామి గౌడ (ఇండిపెండెంట్) - కర్ణాటక - రూ.1,267 కోట్లు

ప్రియాకృష్ణ (కాంగ్రెస్) - కర్ణాటక - రూ.1,156 కోట్లు

ఎన్ చంద్రబాబు నాయుడు (టీడీపీ) - ఏపీ సీఎం - రూ.931 కోట్లు

పొంగూరు నారాయణ (టీడీపీ) - ఆంధ్రప్రదేశ్ - రూ.824 కోట్లు

వైఎస్ జగన్ (వైసీపీ) - ఏపీ మాజీ సీఎం - రూ.757 కోట్లు

వి ప్రశాంతి రెడ్డి (టీడీపీ) - ఆంధ్రప్రదేశ్ - రూ.716 కోట్లు

ఇలా టాప్ 10 అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో ఏపీకి చెందినవారు నలుగురు ఉండగా.. టాప్ 20 అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో ఐటీ మంత్రి లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సహా ఏడుగురు ఉన్నారు.

టాప్ 3 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల అత్యధిక సగటు ఆస్తులు!:

ఆంధ్రప్రదేశ్ - రూ.65.07 కోట్లు

కర్ణాటక - రూ.63.58 కోట్లు

మహారాష్ట్ర - రూ.43.44 కోట్లు

టాప్ 3 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల అత్యల్ప సగటు ఆస్తులు!:

త్రిపుర - రూ.1.51 కోట్లు

పశ్చిమ బెంగాల్ - రూ.2.80 కోట్లు

కేరళ - రూ.3.13 కోట్లు

Tags:    

Similar News