అర్ధరాత్రి బ్యాంకులో ఎలుకల హల్ చల్.. కన్ఫ్యూషన్ లో పోలీసులు..
ఇంట్లో డబ్బు నగదు దాచుకోవడం కంటే కూడా బ్యాంకులో పెట్టుకుంటే భద్రంగా ఉంటాయని మనం ఎక్కువగా నమ్ముతాం.
ఇంట్లో డబ్బు నగదు దాచుకోవడం కంటే కూడా బ్యాంకులో పెట్టుకుంటే భద్రంగా ఉంటాయని మనం ఎక్కువగా నమ్ముతాం. అందుకే మన డబ్బుని భద్రంగా బ్యాంకుల్లో దాచుకుంటా. ఇక బ్యాంకు వారు కూడా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఉత్తరప్రదేశ్ లోని ఒక బ్యాంకులో బుధవారం నాడు సడన్గా అర్ధరాత్రి సైరన్ మొగడంతో అందరూ అలర్ట్ అయ్యారు. అయితే బ్యాంకుకు వచ్చి దొంగను పట్టుకోవడానికి తెగ ప్రయత్నించిన అధికారులు సైరన్ ఎలా మోగింది అన్న విషయాన్ని తెలుసుకొని షాక్ అయ్యారు.
ఇంతకీ సంగతేమిటంటే ఉత్తర ప్రదేశ్ లోని షాహాబాద్లోని హర్దోయ్ లో అర్ధరాత్రి ఒంటిగంటకు అకస్మాత్తుగా బ్యాంకులో దొంగలు పడ్డట్టు సైరన్ మోగింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. బ్యాంకు దగ్గరికి చేరుకున్న పోలీసులు క్యాషియర్ ని పిలిపించి లోపల భారీ ఎత్తున తనిఖీలు కూడా నిర్వహించారు. గంటలకు వెతికిన లోపల ఎక్కడ దొంగతనం జరిగిన జాడ కూడా కనిపించలేదు. బ్యాంకు చుట్టుపక్కల కూడా దొంగలు ఏమన్నా కనిపిస్తారేమో అన్న ఉద్దేశంతో భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించారు.
బస్టాండ్ వద్దనున్న ఆర్యవర్ట్ గ్రామీణ బ్యాంకులో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది.అయితే సైరన్ ఎలా మోగింది అన్న విషయం ఎవరికి అర్థం కాలేదు. చాలాసేపు వెతికిన తర్వాత బయటపడ్డ అసలు విషయం ఏమిటంటే.. ఎలుకలు సైరన్ వైర్లను కొరకడం వల్ల సైరన్ ఆటోమాటిక్గా మోగిందని అధికారులు తెలుసుకున్నారు. ఊహించని విధంగా అక్కడ దొంగతనం ఏమీ జరగలేదు అని అర్థం అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎలుకలు చేసిన ఈ చిలిపి పని అర్థ రాత్రి అందరిని ముప్పు తిప్పలు పెట్టింది.
అసలు విషయం తెలుసుకున్నాక అందరూ నవ్వుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు. ఇలా మొత్తానికి దొంగతనం జరగకపోయినా అర్థరాత్రి ఎలుకల వల్ల బ్యాంకు ఉన్న వీధిలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. ఇటు అధికారులు కూడా దొంగలు ఎక్కడ ఉన్నారో.. ఏం దోచుకున్నారో తెలియక తెగ తికమక పడ్డారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులకు ప్రస్తుతం ఈ బ్యాంకులో ఎలుకలు లాంటివి చేరకుండా శుభ్రం చేయిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయి అని వారు ఆశిస్తున్నారు.