ఉద్యోగుల ఓటు బ్యాంకుపై కేసీఆర్ నజర్.. కాంగ్రెస్ ఊసేలేదుగా!
ఇక, డీఏ, ఎరియర్స్ విషయంలోనూ కేసీఆర్ సర్కారు దూకుడుగా ఉంది. వాటిని దాదాపు క్లియర్ చేసేసింది. అదేసమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించింది.
తెలంగాణ ఎన్నికల్లో ఉద్యోగుల ఓటు బ్యాంకు దాదాపు 8 లక్షలుగా లెక్క తేలింది. ఈ ఓటు బ్యాంకు అన్ని ప్రధాన పార్టీలకూ ముఖ్యంగా అధికారంలోకి రావాలనుకునేవారికి ప్రధానంగా మారిపోయింది. అయితే.. ఉద్యోగులను ఆకర్షించే విషయంలో ప్రస్తుతానికి అధికార పార్టీ బీఆర్ ఎస్ ముందంజలో ఉందని అంటు న్నారు పరిశీలకులు. ఉద్యోగుల వేతనాలు.. గతంలో 1వ తారీకున వచ్చేవి కాదు. కానీ, గత రెండు మాసాలు గా 1వ తారీకు లోపునే వారి ఖాతాల్లోకి వేస్తున్నారు.
ఇక, డీఏ, ఎరియర్స్ విషయంలోనూ కేసీఆర్ సర్కారు దూకుడుగా ఉంది. వాటిని దాదాపు క్లియర్ చేసేసింది. అదేసమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. ఇక, ఆఫీసుల్లో మౌలిక వసతుల కల్పనకు కూడా.. నిధులు మంజూరు చేసింది. ఇవన్నీ.. ఎన్నికలకు ముందుగానే పక్కా ప్రణాళికతో సీఎం కేసీఆర్ పూర్తి చేయడంతో విపక్షాలకు ఇప్పుడు విమర్శించే అవకాశం లేకుండా చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ''ఇంతకన్నా ఎవరు వచ్చినా.. ఏం చేస్తారు?'' అనే టాక్ ఉద్యోగుల్లో వినిపిస్తుండడం గమనార్హం. మరోవైపు అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఉద్యోగుల విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు. కేవలం నిరుద్యోగులఅంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తోంది. ఇక, బీజేపీ ఇంకా ప్రధాన అంశాలపై దృష్టి పెట్టలేదు.
ఈ పరిణామాలను గమనిస్తున్న వారు ఈ సారి.. ఉద్యోగుల ఓటు బ్యాంకు.. కేసీఆర్‌కేనని ఘంటా పథంగా చెబుతున్నారు. మరి చివరి నిముషంలో ఏమైనా రాజకీయ వ్యూహాలు మారితే తప్ప.. ఇప్పటికైతే.. కేసీఆర్ వైపే ఉద్యోగులు ఉన్నారనేది విశ్లేషకులు కూడా చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.