ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడిని నేనే.. ఈటల

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రగడ రేపుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి

Update: 2024-04-07 09:30 GMT

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రగడ రేపుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. పలువురు వీఐపీల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని వారిని తమ పార్టీ వైపు తిప్పుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ పై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

దీన్ని బీఆర్ఎస్ పార్టీ తేలిగ్గా తీసుకుంటోంది. ఏదో నాలుగైదు ఫోన్లు ట్యాపింగ్ చేస్తే ఇంత దుమారం చేయాలా? అని పేర్కొనడం వారి సిగ్గుమాలిన తనానికి చేటు. వ్యక్తిగత విషయాలను ట్యాప్ చేయడం వారికి ఎవరు ఇచ్చిన హక్కు. ఒకరి విషయాలు మరొకరు తెలుసుకోవడం సభ్యత కాదు. ఒకరి ఉత్తరాలు మరొకరు చదివితేనే ఓర్చుకోరు. అలాంటిది ఫోన్లు ట్యాప్ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు.

బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర చర్చ జరగాలని పట్టుబడుతున్నారు. ఈ అంశంపై రాష్ట్ర గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. దేశంలో ప్రధాని మోదీ చరిష్మా రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపి సిగ్గు లేకుండా ఇలా ప్రవర్తించడం దేనికి నిదర్శనమని ప్రశ్నిస్తున్నారు. ఇందులో మొదటి బాధితుడిని తానేనని ఈటల చెబుతున్నారు.

ఫోన్ ట్యాపింగ్ చేసి పలువురి విషయాలు తెలుసుకుని వారిని తప్పుదారి పట్టించారని తెలుస్తోంది. సిగ్గుమాలిన పనులు చేస్తూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు దారుల్లో వెళ్తున్నారని మండిపడ్డారు. నీచంగా ఫోన్ ట్యాపింగ్ చేసి వారి అనైతికతను బయటపెట్టుకున్నారు. ఈనేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిగ్గు తేల్చి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News