రోదసీలోకి వెళ్లి తొలి పర్యాటక భారతీయుడు తోటకూర గోపీచంద్

అమెజాన్ సంస్థకు చెందిన న్యూషెపర్డ్ 25 వ్యోమనౌకలో గోపీచంద్ తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు.

Update: 2024-05-20 04:47 GMT

తెలుగోడు తోటకూర గోపీచంద్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. రోదసీ యాత్రను చేపట్టిన రెండో వ్యోమోగామిగా నిలిచారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడు ఆయనే. మరి అలా అయితే.. కల్పనా చావ్లా.. సునీతా విలియమ్్.. రాజాచారి.. శిరీష బండ్ల కూడా రోదసీ ప్రయాణాలు చేశారు కదా? అని అనుకోవచ్చు. వారంతా భారత మూలాలు ఉన్న అమెరికా పౌరులు. తోటకూర గోపీచంద్ మాత్రం అందుకు భిన్నం. ఎందుకుంటే.. ఆయనకు ఇప్పటికి భారత పాస్ పోర్టు ఉంది. అంతేకాదు.. రోదసీ యాత్ర చేసిన తొలి భారత టూరిస్టుగా గోపీచంద్ నిలవనున్నారు.

ఇతగాడు అసలుసిసలైన తెలుగోడు కావటం మరో విశేషం. విజయవాడలో పుట్టిన గోపీచంద్.. అట్లాంటా శివారులోని ప్రిజర్వ్ లైఫ్ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు. పైలట్ గా శిక్షణ పొందిన గోపీచంద్.. ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్సు విభాగంలోనూ సేవలు అందించారు. హాట్ ఎయిర్ బెలూన్లు.. గ్లైడర్లు.. సీప్లేన్ నడిపిన బ్యాక్ గ్రౌండ్ ఉన్న అతగాడు తాజాగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన వ్యోమనౌకలో యాత్రను పూర్తి చేశారు.

అమెజాన్ సంస్థకు చెందిన న్యూషెపర్డ్ 25 వ్యోమనౌకలో గోపీచంద్ తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. వెంచర్ క్యాపిటలిస్టు మేసన్ ఏంజెల్.. ఫ్రాన్స్ పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్.. అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్.. కరోల్ షాలర్.. అమెరికా ఎయిర్ ఫోర్సు మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ లు ఉన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే డ్వైట్ అంతరిక్ష యానానికి ఎంపికైన తొలి ఆఫ్రో అమెరికాన్. కానీ.. ఆయన రోదసిలోకి వెళ్లే అవకాశాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. తాజాగా తన 90 ఏళ్ల వయసులో రోదసీలోకి వెళ్లాలన్న కలను నెరవేర్చుకున్నారు. రోదసిలోకి ప్రయాణం చేసిన అత్యంత పెద్దవయస్కుడిగా ఆయన గుర్తింపు పొందడటం విశేషం.

పశ్చిమ టెక్సాస్ నుంచి అక్కడి స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9.36 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ ధ్వని కన్నా మూడు రెట్ల వేగంగా దూసుకెళ్లిన వీరి రాకెట్.. భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎగువన ఉండే కార్మాన్ రేఖను దాటి వెళ్లింది. ఈ రేఖను భూ వాతావరణానికి.. అంతరిక్షానికి సరిహద్దుగా లెక్కిస్తారు.

ఇక్కడే రాకెట్ బూస్టర్ క్యాప్సూల్ నుంచి విడిపోయింది. కాసేపు ఆరుగురు ప్రయాణికులు భారరహిత స్థితిని అనుభవించారు. క్యాప్యూల్ అద్దాల కిటికీల నుంచి భూమికి సంబంధించిన అద్భుతమైన ద్రశ్యాల్ని చూశారు. అనంతరం పారాచూట్ల సాయంతో క్యాప్సూల్ నుంచి నేల మీదకు వచ్చారు. వీరురావటానికి కాస్త ముందుగా రాకెట్ బూస్టర్ కూడా భూమి మీద సేఫ్ గా ల్యాండ్ అయ్యింది.

Tags:    

Similar News