వారంలోనే ఫస్ట్ లిస్ట్ ?

కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి జాబితా విడుదల కాబోతున్నట్లు సమాచారం.

Update: 2024-02-01 15:30 GMT

మొదటి వారంలోనే పార్లమెంటు అభ్యర్ధుల మొదటిజాబితాను విడుదల చేయటానికి తెలంగాణా బీజేపీ రెడీ అవుతోంది. కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి జాబితా విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు బీజేపీ ఖాతాలో నాలుగు పార్లమెంటు స్ధాలున్న విషయం తెలిసిందే. కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్ లో సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, కిషన్ రెడ్డి పోటీచేయటం ఖాయమైపోయింది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు టికెట్ విషయం మాత్రమే ఊగిసలాటలో ఉన్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి.

మొదటిజాబితాలో 8-10 సీట్లను ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీలో టాక్ వినబడుతున్నాయి. అంటే సిట్టింగ్ స్ధానాలు, ప్రకటించబోయే నియోజకవర్గాలను కలిపితే మెజారిటి నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేందుకు రంగం సిద్ధమైపోయినట్లే అనిపిస్తోంది. మహాయితే మరో నాలుగు లేదా ఐదు నియోజకవర్గాలు మాత్రమే పెండింగులో ఉంటాయంతే. వీటిల్లో కూడా ఆశావహుల నుండి పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయని, వాటిల్లో వడపోత జరుగుతోందట. మొత్తం ఆశావహుల జాబితా కేంద్ర కమిటికి చేరటం, పరిశీలన జరపటం, కిషన్ మాట్లాడటం అయిపోయిందట.

ఒకటి రెండు సార్లు పార్మల్ గా మీటై అభ్యర్ధులను ఫైనల్ చేయటం మాత్రమే మిగిలుందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆ లాంఛనం కూడా అయిపోతే మొదటివారంలోనే మొదటిజాబితా ప్రకటన ఉంటుందని సమాచారం. చేవెళ్ళ, మహబూబ్ నగర్, భువనగిరి, మెదక్, హైదరాబాద్ నియోజకవర్గాలకు మూడు, నాలుగు పేర్లను షార్ట్ లిస్టు చేశారట. మల్కాజ్ గిరి, జహీరాబాద్ పార్లమెంటు స్ధానాల్లో పోటీకి పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయట.

పై రెండు స్ధానాల్లో పోటీకి పార్టీ నేతలతో పాటు వ్యాపారస్తులు, రియాల్టర్లు, క్యాసినో కింగ్ గా పాపులరైన చికోటి ప్రవీణ్ లాంటి వాళ్ళు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. రిజర్వుడు నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లో సామాజికవర్గాలను సమన్వయం చేసుకుంటు అభ్యర్ధులను ప్రకటించాలని కేంద్రకమిటి ఇప్పటికే నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే దరఖాస్తులను పరిశీలిస్తోంది. మొత్తంమీద 17 నియోజకవర్గాల్లో బీసీలకు తక్కువలో తక్కువ ఐదు సీట్లు కేటాయించబోతున్నట్లు సమాచారం. మున్నూరుకాపు, గౌడ, యాదవ, ముదిరాజ్ లకు టాప్ ప్రయారిటి ఇవ్వబోతున్నారట. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.


Tags:    

Similar News