లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు... భారీ నష్టానికి ఈ అరుదైన చేపలే కారణమా?

లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చులు భారీగా విస్తరిస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి అధికారుల తలప్రాణం తోకకొస్తుందని అంటున్నారు.

Update: 2025-01-11 03:00 GMT

లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చులు భారీగా విస్తరిస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి అధికారుల తలప్రాణం తోకకొస్తుందని అంటున్నారు. ఇప్పటికే సుమారు రూ.12 లక్షల కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ కార్చిచ్చు దాటికి సుమారు లక్షన్నర మంది తమ తమ నివాసాలు కాలీ చేశారని చెబుతున్నారు. ఈ సమయంలో ఈ పొగ, మంటలు అంతరిక్షంలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అవును... లాస్ ఏంజెలెస్ ను తగులబెట్టుకుంటూ వెళ్తున్న కార్చిచ్చుకు సంబంధించిన పొగ, మంటలు అంతరిక్షంలోని ఉపగ్రహాలకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా కనిపించిన దృశ్యాల్లో పూర్తిగా కాలిపోయిన వేల ఎకరాల ప్రాంతం, బూడిదగా మారిన గృహాలతో ఈ ప్రదేశం మరుభూమిని తలిపిస్తోందని అంటున్నారు.

ఈ క్రమంలో... తాజాగా మాక్సర్ సంస్థ విడుదల చేసిన శాటిలైట్ ఫోటోలు.. ఈ కార్చిచ్చు సృష్టించిన బీభత్సాన్ని కళ్లకు కట్టాయి. ఈ ఫోటోల్లో దహనమైన ప్రదేశాలను ప్రత్యేక రంగుల్లో కనిపించేట్లుగా సంస్థ ఫోటోల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా... ఈ ఫోటోల్లో చెట్లు, చేమలు ఎరుపురంగులో కనిపించగా.. దగ్ధమైన ప్రాంతాలు నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఇందులో ప్రధానంగా పాలిసాడ్స్ ఫైర్, ఎటన్ ఫైర్ ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లోనూ సుమారు 30 నుంచి 35 వేల ఎకరాల భూమి కాలి బూడిదైనట్లు అధికారులు చెబుతున్నారు. మరోపక్క మృతుల సంఖ్య పెరిగి 10కి చేరింది.

మరోపక్క తాజా పరిస్థితులపై ట్రంప్, ఎలాన్ మస్క్ లు సీరియస్ గా స్పందించారు. ఈ సందర్భంగా కాలిఫోర్నియా గవర్నర్ కారణంగానే ఈ స్థాయి నష్టం వాటిల్లిందంటూ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో ఆ గవర్నర్ రాజీనామా చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో... ట్రంప్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందంటూ మస్క్ పోస్ట్ పెట్టారు.

కాగా... ఏటీఎం కార్డు సైజులో ఉండే అరుదైన పప్ ఫిష్ అనే దానిని రక్షించేందుకు కొన్నాళ్ల నుంచి కాలిఫోర్నియాకు నీటి సరఫరలో కోత కోతవేశారు. దీంతో.. ఈ చేపల సంరక్షణ కారణంగా సుమారు లక్షల ఎకరాల్లో పంటలు కూడా ప్రభావితం అవుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలోనే... చిన్న చేప కోసం దక్షిణ కాలిఫోర్నియాకు నీటి సరఫరా తగ్గించి ఈ స్థాయి నష్టానికి కారణమయ్యారని ట్రంప్ ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News