విమాన ప్రయాణంలో ఆ పరికరాలు త్వరగా వేడెక్కుతున్నాయి

నిబంధనలకు విరుద్ధంగా పోర్టబుల్ ఛార్జర్లు.. ఈ సిగిరెట్లను తనిఖీ చేసిన బ్యాగుల్లోనే పెట్టుకుంటున్నట్లుగా వెల్లడించింది.

Update: 2024-09-10 09:30 GMT

కొత్త విషయాన్ని గుర్తించారు. తాజాగా విడుదలైన ఒక అధ్యయనంలో ఈ వషయాన్ని గుర్తించారు. విమాన ప్రయాణాల వేళ.. లిథియం అయాన్ బ్యాటరీ కలిగిన పరికరాలు త్వరగా వేడెక్కుతున్న విషయం వెల్లడైంది. ఇలాంటి వస్తువులు ప్రరయాణికుల చెకింగ్ బ్యాగుల్లో ఉంచటం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నారు. అనూహ్య పరిణామాలు అరుదుగా సంభవించే వీలున్నా.. 2019-23 మధ్య కాలంలో మాత్రం ఈ తరహా అంశాల పెరుగుదల 28 శాతం ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు చూసే యూఎల్ స్టాండర్డ్స్ తన తాజా నివేదికలో బోలెడన్ని ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. తాము అధ్యయనం చేసిన కాలంలో మొత్తం 35 విమానాల్లో ఈ తరహా కేసులు నమోదైనట్లుగా గుర్తించారు. ఇతర పరికరాలతో పోలిస్తే ఈ సిగిరెట్లు ఎక్కువగా వేడెక్కుతున్న విషయాన్ని గుర్తించారు. 60 శాతం కేసుల్లో ప్రయాణికుల సీటుకు సమీపంలోనే ఓవర్ హీటింగ్ ఘటనలు చోటు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా పోర్టబుల్ ఛార్జర్లు.. ఈ సిగిరెట్లను తనిఖీ చేసిన బ్యాగుల్లోనే పెట్టుకుంటున్నట్లుగా వెల్లడించింది. తమ అధ్యయనంలో భాగంగా ఈ తరహా ఘటనల్ని ఉదహరించారు. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో టేకాఫ్ తీసుకుంటున్న విమానం లో ప్రయాణికుడి బ్యాగులో ఉన్న ల్యాప్ టాప్ నుంచి పొగలు రావటంతో ప్రయాణికులు కంగారు పడ్డారు.

దీంతో విమానం నుంచి ప్రయాణికుల్ని కిందకు దించేయాల్సి వచ్చింది. మరో ఉదంతంలో డాలస్ నుంచి ఫ్లోరిడా వెళ్లే ఫ్లైట్ లోని స్టోరేజీ ప్రదేశంలో ఒక బ్యాటరీ కాలిపోయిన వైనాన్ని గుర్తించారు.ఆ వెంటనే.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో లిథియం బ్యాటరీలపై మరిన్ని పరిమితులకు అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News