అత్యధిక, అతితక్కువ గంటలు పనిచేసే దేశాలివే... భారత్ స్థానం ఇదే!

ఈ క్రమంలో 2024లో అత్యధిక పని గంటలు ఉన్న టాప్ - 10 దేశాలు, అత్యల్ప పని గంటలు ఉన్న టాప్ - 10 దేశాల జాబితా తెరపైకి వచ్చింది.

Update: 2025-01-12 18:30 GMT

గత కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా, ప్రధానంగా భారత్ లోనూ ఉద్యోగుల పని గంటలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పని గంటలు పెరుగుతున్నందు వల్ల ఉద్యోగులపై మానసిక, శారీరక ఒత్తిడి పెరుగుతుందని.. విషాదకర నిర్ణయాలకు దారి తీస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో.. ఎక్కువ పని గంటల వల్ల దేశాభివృద్ధి సాధ్యమనే మాటలూ వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా లార్సెన్ & టూబ్రో (ఎల్ & టీ) ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ స్పందిస్తూ.. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని ప్రతిపాదించారు. దీంతో ఈ విషయంలో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో.. పూణెలో ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే మరణించిన అన్నా సెబస్టియన్ టాపిక్ తెరపైకి తెస్తున్నారు నెటిజన్లు.

ఈ సమయంలో ఈ వ్యవహారంపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతుంది. మరో విషయం ఏమిటంటే... ప్రపంచ వ్యాప్తంగా పని గంటల్లో ఆయా ప్రాంతాల్లో గణనీయంగా మారుతూ ఉంటాయి. వాస్తవానికి అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను నెలకొల్పినప్పటికీ.. ఇప్పటికీ వీటిలో చాలా సమస్యలు నేటికీ కొనసాగుతున్నాయని అంటున్నారు.

ప్రధానంగా కొన్ని సంస్థల్లో ఉద్యోగల వల్ల వ్యక్తి వ్యక్తిగత, కుటుంబ జీవితం పూర్తిగా దెబ్బతింటుందని.. మనిషి యాంత్రికంగా మారిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాండ్ స్టాండ్ వర్క్ మానిటర్ నివేదిక ప్రకారం 93.7శాతం మంది ఉద్యోగులు పని - పర్సనల్ లైఫ్ సమతుల్యత అవసరమని వెల్లడించారు.

ఈ క్రమంలో 2024లో అత్యధిక పని గంటలు ఉన్న టాప్ - 10 దేశాలు, అత్యల్ప పని గంటలు ఉన్న టాప్ - 10 దేశాల జాబితా తెరపైకి వచ్చింది. ఈ విషయంలో... అత్యధిక పని గంటలు ఉన్న దేశాల్లో భూటాన్ ప్రపంచవ్యాప్తంగా టాప్ ర్యాంక్ ను కలిగి ఉంది. ఇక్కడ ఉద్యోగులు వారానికి సగటున 54.5 గంటలు పని చేస్తారు.

ఆ తర్వాత స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) 50.9 గంటలతో రెండో స్థానంలో ఉండగా.. లెసో 50.4 గంటలతో అత్యధిక సగటు వారపు పని గంటల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

ఇదే క్రమంలో... ఉద్యోగులు వారానికి అతి తక్కువ పని గంటలు ఉన్న దేశంగా వనాటు అవతరించింది. ఇక్కడ ఉద్యోగులు వారానికి సగటున 24.7 గంటలు మాత్రమే పని చేస్తారు. ఇక్కడున్న శ్రామికశక్తిలో కేవలం 4 శాతం మంది మాత్రమే వారంలో 49 గంటలు లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేస్తారని చెబుతున్నారు.

భారతదేశ స్థానం ఇదే:

ప్రపంచంలోని అత్యధికంగా పనిచేసే దేశాలలో భారతదేశం స్థనం 13 గా ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం... ప్రతీ భారతీయ కార్మికుడు సగటున వారానికి 46.7 గంటలు పని చేస్తాడు. ఇదే సమయంలో దేశంలోని 51 శాతం మంది శ్రామికశక్తి వారానికి 49 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పని చేస్తారు.

2024లో వారానికి సగటున అత్యధిక పని గంటలు ఉన్న టాప్-10 దేశాలు!:

1. భూటాన్ - 54.4 గంటలు

2. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) - 50.9

3. లెసెతో - 50.4

4. కాంగో - 48.6

5. ఖతర్ - 48.0

6. లైబీరియా - 47.7

7. మౌరిటానియా - 47.6

8. లెబనాన్ - 47.6

9. మంగోలియా - 47.3

10. జోర్డాన్ - 47.0

2024లో వారానికి సగటున అతి తక్కువ పని గంటలు ఉన్న టాప్-10 దేశాలు!:

1. వనాటు - 24.7

2. కిరిబాట - 27.3

3. మైక్రోనేషియా - 30.4

4. రువాండ - 30.4

5. సొమాలియా - 31.4

6. నెదర్లాండ్స్ - 31.6

7. ఇరాక్ - 31.7

8. వాలిస్, పుటునా దీవులు - 31.8

9. ఇథియోఫియా - 31.9

10. కెనడా - 32.1

Tags:    

Similar News