నోరూరిస్తున్న గోల్డ్ కజ్జికాయలు... ధర కేజీ రూ.50వేలు మాత్రమే!
కజ్జికాయల గురించి చాలా మందికి తెలిసిందే. ఆ స్వీట్లలో ఉండే రుచికి చాలా మంది ఫిదా అయిపోతుంటారు.;
కజ్జికాయల గురించి చాలా మందికి తెలిసిందే. ఆ స్వీట్లలో ఉండే రుచికి చాలా మంది ఫిదా అయిపోతుంటారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్న వేళ ఈ స్వీట్లకు ఫుల్ డిమాండ్. అయితే... ఇప్పటివరకూ చాలా మందికి తెలిసిన కజ్జికాయలు వేరు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కజ్జికాయలు వేరు. ఇవి బంగారంతో చేసినవి!
అవును... హోలీ సంబరాల వేల రకరకాల స్వీట్లు మార్కెట్ లో దర్శనమిస్తుంటాయి. ఫ్రెష్ గా పాకం కారుతూ కనిపించే స్వీట్లు చూసి.. వాటి ప్రియులు లొట్టలేస్తుంటారు! ఈ సమయంలో తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఓ షాపులో స్పెషల్ కజ్జికాయలు దర్శనమిచ్చాయి. అయితే.. వాటి ధర మాత్రం షాకిస్తుంది! ఎందుకంటే... కేజీ కజ్జికాయలు రూ.50 వేలు!
హోలీ సంబరాలు అంబరాన్నంటుతోన్న వేళ.. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని గోండాలో ఓ స్వీట్ షాపు వ్యాపారి బంగారు కజ్జికాయలు తయారు చేసి అమ్మకానికి పెట్టారు. వీటిని 24 క్యారెట్ పుత్తడితో చేసినట్లు తెలిపారు. వీటి ధర కేజీ రూ.50 వేలు అని.. ఒక్క స్వీటు చాలు అనుకుంటే రూ.1300 అని బోర్డు పెట్టాడు.
ఈ స్పెషల్ కజ్జికాయలపై 24 క్యారెట్ గోల్డ్ పూత పూసినట్లు స్వీట్ షాప్ యజమాని చెబుతున్నాడు. ఇదే సమయంలో వీటిలో ప్రత్యేకమైన డ్రైఫ్రూట్స్ ని నింపినట్లు చెబుతున్నారు. దీంతో... ప్రస్తుతం ఈ కజ్జికాయలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
బరువులో రికార్డ్ సృష్టించిన కజ్జికాయ!:
మరోపక్క.. లక్నో లోని మరో స్వీట్ షాపులోని కజ్జికాయ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇందులో భాగంగా... దేశంలోనే అతిపెద్ద కజ్జికాయను తయారు చేసింది. దీని బరువు అక్షరాలా ఆరు కేజీలు కాగా.. సుమారు 25 అంగుళాల పొడవు కలిగి ఉంది. ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జిక్యూటర్... ఈ ఆరు కిలోల కజ్జికాయ పాత రికార్డులను బద్దలు కొట్టిందని వెల్లడించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమిండియాకు అభినందనలు తెలుపుతూ ఈ కజ్జికాయను మువ్వన్నెల రంగుల్లో స్పెషల్ గా తయారు చేశారు.