గూగుల్ టాప్ 10 సెర్చింగ్ పీపుల్... పవన్, పూనమ్ కు చోటు!
ఈ క్రమంలో 2024లో గూగుల్ లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను ప్రచురించారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి.
గూగుల్ సెర్చ్ లో నిత్యం ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటారు. దాదాపు ఏ విషయం కోసమైనా గూగుల్ పైనే అధారపడతున్నారని చెబుతుంటారు. సినిమా వివరాలు, మ్యాచ్ ఫలితాలు, వ్యక్తుల గురించిన విషయాలు, టూరిజం గురించిన అన్వేషణ, మొదలైనవన్నీ గూగుల్ లోనే సెర్చ్ చేస్తుంటారు! అంతలా మనిషి గూగుల్ పై ఆధారపడ్డారని అంటుంటారు.
ఈ క్రమంలో 2024లో గూగుల్ లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను ప్రచురించారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో... ఈ ఏడాది అత్యధికంగా వెతికిన వాటిలో ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్, ప్రో కబడ్డి లతో పాటు సార్వత్రిక ఎన్నికలు, రతన్ టాటా గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు.
ఇక వ్యక్తుల విషయానికొస్తే... వినేశ్ పోగాట్, నితీష్ కుమార్, హార్ధిక్ పాండ్యా, పవన్ కల్యాణ్, పూనమ్ పాండే మొదలైన వారి గురించి ఎక్కువగా సెర్చ్ చేసినట్లు చెబుతున్నారు. సినిమాల విషయానికొస్తే... స్త్రీ2, కల్కి, 12 ఫెయిల్ వంటి వాటి గురించి ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గూగుల్ వెల్లడించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం...!
గూగుల్ టాప్ 10 సెర్చింగ్ - ఓవరాల్:
ఇండియన్ ప్రీమియర్ లీగ్
టీ20 వరల్డ్ కప్
భారతీయ జనతా పార్టీ
ఎన్నికల ఫలితాలు - 2024
ఒలింపిక్స్
అత్యధిక వేడి
రతన్ టాటా
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
ప్రో కబడ్డీ లీగ్
ఇండియన్ సూపర్ లీగ్
గూగుల్ టాప్ 10 సెర్చింగ్ - వ్యక్తులు:
వినేశ్ పోగాట్
నితీశ్ కుమార్
చిరాగ్ పాశ్వాన్
హార్దిక్ పాండ్యా
పవన్ కల్యాణ్
శశాంక్ సింగ్
పూనమ్ పాండే
రాధికా మర్చంట్
అభిషేక్ శర్మ
లక్ష్య సేన్
గూగుల్ టాప్ 10 సెర్చింగ్ - సినిమాలు:
స్త్రీ2
కల్కి
12 ఫెయిల్
లాపటా లేడీస్
హను-మాన్
మహారాజ
మంజుమల్ బాయ్స్
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
సలార్
ఆవేశం
గూగుల్ టాప్ 10 సెర్చింగ్ - 'షో'లు:
హీరామండి
మీర్జాపూర్
లాస్ట్ ఆఫ్ అజ్
బిగ్ బాస్ 17
పంచాయత్
క్వీన్ ఆఫ్ టియర్స్
మ్యారీ మై హస్బెండ్
కోట ఫ్యాక్టరీ
బిగ్ బాస్ 18
3 బాడీ ప్రాబ్లమ్స్