హైడ్రాపై గవర్నర్ కీలక నిర్ణయం.. చట్టబద్ధత కల్పిస్తూ..

గవర్నర్ వద్దకు పలువురు అధికారులు వెళ్లి ప్రభుత్వం తరఫున హైడ్రా లక్ష్యాలు, పనితీరును వివరించారు. తాజాగా.. హైడ్రా విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-10-05 13:08 GMT

చెరువులు, కుంటలు, నాలాల సంరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చారు. వాటిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది. వందలాది అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ వస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ సపోర్టుతో పేద, ధనిక.. పొలిటికల్ అనే తేడా లేకుండా కూల్చివేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు పలు సందర్భాల్లో కోర్టు విచారణలను ఎదుర్కొంది.

ఇటు బీఆర్ఎస్ లీడర్లు, పలువురు హైకోర్టులో పలుమార్లు పిటిషన్లు వేశారు. హైడ్రాకు చట్టబద్ధత లేదని, అక్రమ కట్టడాలు అని ఎలా నిర్ధారిస్తుందని ఆయా పిటిషన్లలో పేర్కొన్నారు. దాంతో హైకోర్టు కూడా చాలా సందర్భాల్లో హైడ్రాకు చట్టబద్ధత ఏంటని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం గవర్నర్ వద్దకు ఫైల్ పంపించింది.

గవర్నర్ వద్దకు పలువురు అధికారులు వెళ్లి ప్రభుత్వం తరఫున హైడ్రా లక్ష్యాలు, పనితీరును వివరించారు. తాజాగా.. హైడ్రా విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైడ్రాకు మరిన్ని పవర్స్ దక్కనున్నాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా గెజిట్ జారీ చేసింది.

ఎట్టకేలకు హైడ్రాకు పూర్తిస్థాయిలో చట్టబద్ధత రావడంతో ఇక మరింత దూకుడుగా ముందుకు సాగనుంది. మరోవైపు.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రాకు చట్టబద్ధతపై ప్రవేశపెట్టి చర్చించేందుకు సిద్ధం అవుతోంది. ఎలాగూ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకే సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో.. చర్చ కూడా సాఫీగానే ముగుస్తుందనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.

Tags:    

Similar News