ఢిల్లీలో వైసీపీ కొత్త ప్రతినిధి ఆయనేనా ?
వైసీపీలో చాలా మంది నేతలు ఉంటారు. అయితే వారు అంతా తడవకు ఒకసారి మారుతూ ఉంటారు.
వైసీపీలో చాలా మంది నేతలు ఉంటారు. అయితే వారు అంతా తడవకు ఒకసారి మారుతూ ఉంటారు. అలా చూస్తే కనుక ఒకపుడు ఢిల్లీలో వైసీపీ తరఫున చక్రం తిప్పిన వారు వి విజయసాయిరెడ్డి అని చెప్పాలి. ఆయనను ఇపుడు ఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ ఇంచార్జి గా నియమించారు.
దాంతో ఆయన మీద మూడు ఉమ్మడి జిల్లాలను చక్కదిద్దే బాధ్యతలు ఉన్నాయి. మరో వైపు చూస్తే ఢిల్లీలో వైసీపీ తరఫున కొత్త ప్రతినిధిని పరిచయం చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఎవరో కాదు తిరుపతి ఎంపీ గురుమూర్తి అని అంటున్నారు. ఆయన 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున తిరుపతి నుంచి లోక్ సభకు ఎంపీగా నెగ్గారు
జగన్ కి ఆయన అత్యంత సన్నిహితుడు అన్న పేరు ఉంది. ఆయన పార్టీ పట్ల జగన్ పట్ల విధేయుడు గా ఉంటూ వస్తున్నారు దాంతో ఆయనకు వైసీపీ తరఫున ఢిల్లీలో బాధ్యతలు చూసే అవకాశం దక్కింది అని ప్రచారం సాగుతోంది. తాజాగా ఏపీలో మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ మహిళా నేతలు అంతా కలసి జాతీయ మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు.
ఈ మహిళా బృందం ఢిల్లీలో చేరి జాతీయ మహిలా కమిషన్ ని కలుకుకునే మొత్తం కార్యక్రమం వెనక గురుమూర్తి ఉన్నారు. ఆయనే ఈ ఏర్పాట్లు అన్నీ చూసుకున్నారు అని అంటున్నారు. రెండు టెర్ములు ఎంపీగా గెలిచిన గురుమూర్తికి ఢిల్లీలో పరిచయాలు బాగానే ఉన్నాయని అంటున్నారు.
ఇక చూస్తే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. లోక్ సభలో మిధున్ రెడ్డి రాజ్యసభలో వి విజయసాయిరెడ్డి కూడా వైసీపీ తరఫున నాయకులుగా ఉన్నారు. ఇపుడు వీరితో పాటుగా గురుమూర్తిని కూడా ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు. బలమైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గురుమూర్తికి కీలకమైన అవకాశాలు ఇవ్వడం ద్వారా ఆయా వర్గాలలో పలుకుబడిని పెంచుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే అటు వైవీ సుబ్బారెడ్డికి రీజనల్ కో ఆర్డినేటర్ గా కడప జిల్లా బాధ్యతలు ఇచ్చారు. మిధున్ రెడ్డికి ప్రకాశం నెల్లూరు బాధ్యతలు అప్పగించారు. దీంతో కీలక నేతలు అంతా ఏపీ గురించి పార్టీ గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. దాంతో గురుమూర్తి రెడ్డికి ఢిల్లీలో బాధ్యతలు మరింతగా అప్పగిస్తే ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి గురుమూర్తి రానున్న రోజులలో తన పలుకుబడిని ఏ విధంగా చాటుకుంటారో.