హరీశ్ హాట్ హాట్ .. రేవంత్ సీఎం కావచ్చు కానీ .. !

రేవంత్ రెడ్డి సీఎం కావచ్చు. కానీ ఆయన ఎన్నడూ జై తెలంగాణ అనలేదు. ఆయన ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడు.

Update: 2024-06-03 09:38 GMT

రేవంత్ రెడ్డి సీఎం కావచ్చు. కానీ ఆయన ఎన్నడూ జై తెలంగాణ అనలేదు. ఆయన ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడు తప్ప ఉద్యమకారుడు కాలేడు’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో తెలంగాణ దశాబ్ది వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర అవతరణ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా జై తెలంగాణ అన్న పదం లేదు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ప్రకటనల్లో పై భాగంలో జై తెలంగాణ, జైజై తెలంగాణ కచ్చితంగా ఉండేది. ఆరోజు సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేదించారు. ఇప్పుడు రేవంత్ పాలనతో జై తెలంగాణ పదం మాయమైంది అని హరీష్ రావు విమర్శించారు.

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని ఆంధ్రా నాయకులు అంటున్నారు. కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష. కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోయిని ఖతం చేస్తారు. తెలంగాణ హక్కుల కోసం ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని హరీష్ రావు అన్నాడు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సీఎం కావచ్చు, రేపు అంతకంటే పెద్ద పీఠం ఎక్కవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమకారుడు అనే కీర్తి రేవంత్ రెడ్డి చచ్చి పిడికెడు మన్ను బుక్కినా రాదు. సిద్దిపేటలో ఉండి పోరాడిన ఒక తెలంగాణ పోరాట కార్యకర్త పాద దూలికున్న విలువ కూడా రేవంత్ రెడ్డికి లేదు’ అని అన్నాడు

Tags:    

Similar News