హార్లే-డేవిడ్ సన్ బైక్స్ టారిఫ్స్ లో మార్పులు... భారత్ లో ట్రంప్ ఎఫెక్ట్?

ఇదే సమయంలో... పశ్చిమాసియాలోని యుద్ధాలపైనా పుష్కలంగా కనిపించొచ్చని చెబుతున్నారు.

Update: 2024-11-09 03:59 GMT

అమెరికా అధ్యక్ష ఎనికల్లో ట్రంప్ విజయం సాధించడంతో ప్రపంచ దేశాల్లో పలు పరిస్థితులు మారే అవకాశంఉందనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ట్రంప్ గెలుపు ప్రభావం చైనాపై ఎక్కువగా ఉండోచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో... పశ్చిమాసియాలోని యుద్ధాలపైనా పుష్కలంగా కనిపించొచ్చని చెబుతున్నారు.

మరోపక్క గత కొంతకాలంగా భారత్ ను "సుంకాల రాజు" అంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పటికె చర్చకు వచ్చాయి. గతంలో హార్లే-డేవిడ్ సన్ బైక్స్ దిగుమతి పన్నులను ప్రస్థావించిన ట్రంప్... భారత్ నుంచి ఎదురవుతున్న సుంకాలు 150% ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. తన ఉద్దేశ్యంలో చైనా కంటే భారత్ చాలా రకాలుగా ఎక్కువ వసూలు చేస్తుందని తెలిపారు.

అనంతరం... తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే.. భారత్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాల భారం పెంచుతామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో విజయం సాధించారు. ఈ సమయంలో... భారత్ లో హార్లే-డేవిడ్ సన్ బైక్స్ టారిఫ్స్ తగ్గింపుపై కేంద్రమంత్రి నుంచి ఆసక్తికర స్పందన వెలువడింది.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన వేళ సుంకాల తగ్గింపూ అంశాన్ని భారత్ పరిశీలిస్తుందా అన్న ప్రశ్నకు సమాధానంగా స్పందించిన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్... హార్లే-డేవిడ్ సన్ బైక్స్ పై సుంకాలను తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థనకు భారత్ సిద్ధంగా ఉండవచ్చని అన్నారు.

బిజినెస్ టుడే "మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ - 2024" ఈవెంట్ లో మాట్లాడిన పీయూష్ గోయల్... ఐకానిక్ బైక్స్ పై సుంకాలను పునఃపరిశీలించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు! భారత్ తో వాణిజ్యాన్ని పెంచుకోవడంపై యూఎస్ ఆసక్తిని అంగీకరిస్తూ.. ఈ మేరకు వచ్చే అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవడంలో తనకు ఎటువంటి సమస్య ఉండదని చెప్పారు.

దిగుమతి చేసుకున్న వివిధ రకాల వస్తువులపై సుంకాలను తగ్గించడం గురించి ప్రభుత్వం చాలా కాలంగా కేర్ తీసుకుంటుందని.. అయితే.. హార్లే-డేవిడ్ సన్ బైక్స్ వంటి నిర్ధిష్ట ఉత్పత్తుల విషయంలో దేశీయంగా వాటికి సమానమైనది లేని చోట అటువంటి అభ్యర్థనను మళ్లీ పరిశీలిస్తామని తెలిపారు!

ఇదే సమయంలో... భారతదేశాని నమ్మదగిన, విశ్వసనీయ భాగస్వామిగా ప్రజాస్వామ్య ప్రపంచం చూస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం, డెమోగ్రఫిక్ డివిడెండ్, డిమాండ్, నిర్ణయాత్మక నాయకత్వం అనే నాలుగు కారణాలు.. సుంకం సంబంధిత సవాళ్లతో సంబంధం లేకుండా భారత్ ను ఆకర్షణీయమైన వాణిజ్య భాగస్వామిగా మారుస్తాయని తెలిపారు.

ఇదే సమయంలో... భారతదేశాన్ని డొనాల్డ్ ట్రంప్ ఇష్టపడతారని.. భారత్ తో వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటారని.. భారత్ తో మరింత వాణిజ్యం చెయాలని కోరుకుంటున్నారని.. మంచి స్నేహితుడు, మోడీతో కలిసి పనిచేయాలనుకుంటున్నారని గోయల్ చెప్పుకొచ్చారు! ఏది ఏమైనా... భారత్ లో త్వరలో హార్లే-డేవిడ్ సన్ బైక్స్ టారిఫ్స్ తగ్గే అవకాశం మాత్రం కనిపిస్తుందనే చెప్పాలి!!

Tags:    

Similar News