పవర్ పట్టేస్తే జంపింగులే... లెక్క అట్లుంటది ...!
ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అంటే పోటా పోటీగానే రాజకీయం సాగుతోంది.
ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అంటే పోటా పోటీగానే రాజకీయం సాగుతోంది. వైసీపీ సోలోగా మొత్తం 175 సీట్లలో అభ్యర్ధులను నిలిపింది. టీడీపీ జనసేన బీజేపీలతో కూటమి కట్టింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం పట్టాలని టీడీపీ చూస్తోంది. వైసీపీ అయితే మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది.
వై నాట్ 175 అంటూ వైసీపీ రెండేళ్ల క్రితం నుంచి స్లోగన్ ని మొదలెట్టింది. అయితే వైసీపీ ఎంతగా ఈ టార్గెట్ ని పెట్టుకున్నా అసలు వాస్తవాలు చూస్తే అలా లేవు అనే అంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చినవి 151 సీట్లు. ఈసారి అంతకు మించి ఎందుకు వస్తాయన్న లాజిక్ క్వశ్చన్ ఉండనే ఉంటుంది. ఎందుకంటే అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. దానికి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు.
అవతల పక్షం వీక్ గా ఉంటే తప్ప ఇది సాధ్యపడదు, అపుడు బొటా బొటీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తే చాలు అని చూస్తారు. ఇపుడు వైసీపీ లో కూడా ఇంటర్నల్ గా అలాంటి టాక్ నడుస్తోంది అని అంటున్నారు. ఏపీలో అధికారం చేపట్టాలీ అంటే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు. దీనికి కాస్తా అయిదో పదో వస్తే చాలు అన్నట్లుగానే అధికార పార్టీ సీన్ ఉంది అని అంటున్నారు.
అంటే వంద సీట్లకు ఏదో విధంగా తెచ్చుకుంటే చాలు తాము సూపర్ హిట్ అయినట్లే అని భావిస్తున్నారుట. అంటే వంద సీట్లతో అధికారంలోకి వస్తే ఎటూ జంపింగ్స్ ని ప్రోత్సహిస్తారు. ఆ విధంగా అపోజిషన్ లేకుండా చేసుకోవచ్చు అన్నది వైసీపీ బడా ప్లాన్ గా ఉంది అని అంటున్నారు. ఆ విధంగా వై నాట్ 175 పవర్ దక్కాక అమలు చేసే అవకాశాలు అయితే ఉంటాయని ప్రచారం సాగుతోంది.
ఇక తెలుగుదేశం పార్టీ గురించి తీసుకుంటే ఆ పార్టీ 160 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని సభలలో చెబుతోంది. అయితే కూటమి ఆశలు కూడా సెంచరీ దాటితే చాలు అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు. ఎటూ ప్రభుత్వంలోకి ఒకసారి వచ్చాక ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు. దాని కంటే ముందు విపక్షంలో ఉన్న వారే అధికార పార్టీ వైపు పరుగులు పెడతారు అని అంటున్నారు.
దాంతో ముందు పవర్ పట్టుకుటే చాలు అన్నదే రెండు పార్టీలలో వినిపిస్తున్న మాట. అంటే ఒకసారి అధికారంలోకి వస్తే ఏ పార్టీ అయినా విపక్షాన్ని బతకనీయదు అని ప్రచారం మాత్రం సాగుతోంది. ఇక తెలంగాణాలో చూసుకుంటే నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో లాగేస్తోంది అని గులాబీ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు
అయితే తమ వద్దకు వచ్చిన వారిని చేర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు వారి వచ్చినా వీరు చేర్చుకున్నా ఫిరాయింపులు అన్నవి అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి చేరుకోవడం ఖాయంగా మారిపోయాయి. ఇపుడు అదే ఏపీలో జరుగుతుంది అని అంటున్నారు. ఇక ఏపీలో అదే జరుగుతుందని దానికి 2014, 2019లలో జరిగిన పరిణామాలను ఉదహరిస్తున్నారు.
ఈ రెండు సందర్భాలలో అధికారంలో ఉన్న పార్టీలు విపక్షాలను వీక్ చేయడానికే చూశాయి. టీడీపీ అయితే ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి తీసుకుంది. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ఒక జనసేన ఎమ్మెల్యేను తన పార్టీ వైపుగా ఆకర్షించారు. అయితే వైసీపీకి బండ మెజారిటీ ఉండడంతో కొంత తగ్గారు.
ఈసారి వంద నుంచి 110 సీట్లు తమకు రావచ్చు అని వైసీపీ అంచనా కడుతోంది. దాంతో కచ్చితంగా అధికారంలోకి వస్తే మాత్రం టీడీపీ సహా విపక్షాలను చీల్చిచెండాడడం ఖాయం అని అంటున్నారు. అదే తీరున టీడీపీ కూడా చూస్తుంది అని అంటున్నారు.కూటమితో పోటీ చేస్తూ 144 సీట్లకే అభ్యర్ధులను టీడీపీ నిలబెడుతోంది.
అందువల్ల మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా టీడీపీకి సీట్లు రాకపోతే కచ్చితంగా వైసీపీ నుంచి తెచ్చుకుని తన సొంత బలాని పెంచుకుంటుందని అలాగే వైసీపీని నిర్వీర్యం చేసే కొత్త ఎత్తుగడలకు టీడీపీ సిద్ధపడుతుందని అంటున్నారు.