మెజారిటీల కుంభవృష్టి !

దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ స్థానాల్లో ఒక్కొక్క అభ్యర్థి సాధించిన మెజారిటీ ఓట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

Update: 2024-06-05 09:30 GMT

దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ స్థానాల్లో ఒక్కొక్క అభ్యర్థి సాధించిన మెజారిటీ ఓట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షాది అత్యధిక మెజారిటీ అనుకుంటే బెంగాల్ ముఖ్యమంత్రి మమత అల్లుడు అభిషేక్ బెనర్జీది అనుకున్నారు. కానీ ఆ జాబితా చాలా పెద్దగా ఉంది.

దేశంలో అసోంలోని దుబ్రి నియోజకవర్గం నుండి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుసేన్ తన ప్రత్యర్థి ఆల్ ఇండియా యునైటెడ్ డెమక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి బద్రుద్దీన్ అజ్మల్ పై ఏకంగా 10,12,476 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం దేశంలో సంచలనం రేపింది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బీజేపీ నేత శంకర్‌ లాల్వానీకి పది లక్షల 8వేల 77 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక్కడ నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షయ్‌ కాంతిరామ్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని బీజేపీలో చేరాడు. దీంతో నోటాకు ఓట్లేయాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఇక్కడ నోటాకు రెండు లక్షల 18వేల 676 ఓట్లు పడటం గమనార్హం.

మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ విదిశ నుంచి పోటీచేసిన ఆయనకు ఏకంగా ఎనిమిది లక్షల 21వేల 408 మెజారిటీ వచ్చింది.

గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడు, సిట్టింగ్‌ ఎంపీ సీఆర్ పాటిల్‌ నవసారి నుంచి పోటీచేసిన‌ ఏకంగా ఏడు లక్షల 73వేల 551 ఓట్ల మెజారిటీ సాధించారు.

కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా గుజరాత్ గాంధీనగర్‌ నుంచి ఏడులక్షల 44వేల 716 ఓట్ల మెజారిటీ సాధించారు.

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్‌ బెనర్జీ డైమండ్‌ హార్బర్‌ నియోజకవర్గం నుంచి ఏడు లక్షల 10వేల 930 ఓట్ల మెజారిటీ సాధించాడు. తెలంగాణలో మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డి నల్గొండలో ఐదు లక్షల 59వేల 905 ఓట్ల మెజారిటీ రావడం విశేషం.

Tags:    

Similar News