పాత తరం ఫైటర్ జెట్ లే భారత్ కు దిక్కా? అప్ డేట్ ఎప్పుడు..?

చైనా తాజాగా తాను తయారుచేసిన ఆరోతరం యుద్ధ విమానాన్ని సైతం ప్రదర్శించిందట. మన వద్ద ప్రస్తుతం ఉన్నవి నాలుగోతరం యుద్ధ విమానాలు.;

Update: 2024-12-30 19:30 GMT

2024లో ప్రపంచమంతా సంక్షోభ వాతావరణమే.. ఓ వైపు హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో హెజ్బొల్లా, ఇరాన్ ల ప్రవేశం.. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో పశ్చిమ దేశాల ప్రమేయం.. ఇంకోవైపు తైవాన్-చైనా అంశం.. అప్పుడప్పుడు ఉత్తర కొరియా-దక్షిణ కొరియా జగడం.. బంగ్లాదేశ్ లో తిరుగుబాటు.. చివరగా సిరియాలో అధికార మార్పిడి.. ఇదీ ఈ ఏడాది పరిస్థితి.

ఇలాంటి సమయంలో ముప్పు ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేం.. అందుకని మనంతట మనం సంసిద్ధంగా ఉండాలి. అయితే, రక్షణ పరంగా చూస్తే వాయుసేన అత్యంత కీలకం. వీటిలో ఫైటర్ జెట్ లు అత్యాధునికంగా ఉండాలి. కానీ, భారత్‌ వద్ద ప్రస్తుతం 4వ తరం యుద్ధ విమానాలే ఉన్నట్లుగా తెలుస్తోంది.

మన ప్రత్యర్థి ముందంజ అనేక విషయాల్లో భారత్ తో కయ్యాలకు దిగే చైనా రక్షణ రంగంలోనూ ముందుంది. ఈ దేశం ఆరో తరం ఫైటర్‌ జెట్‌ నూ ప్రదర్శించిదట డ్రాగన్ దేశం. కాగా, చైనాకు పాకిస్థాన్ అంటే వల్లమాలిన ప్రేమ. అందుకే ఆ దేశానికి రెండేళ్లలో 40 జే-35 ఫైటర్‌ జెట్లు ఇవ్వనుంది. కాగా, ఈ తరహా ఫైటర్‌ జెట్ల తయారీకి భారత్‌ ‘ఏఎంసీఏ’ ప్రాజెక్ట్‌ చేపట్టింది. కానీ, 2034లో మాత్రమే మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందట.

అంటే.. చైనా తాను బలపడడమే కాక.. పాకిస్థాన్ కూ సాయం చేస్తూ భారత్ ను చికాకు పెడుతోంది. ఇక రాడార్లకు అందని, సూపర్‌ క్రూయిజ్‌ సామర్థ్యాలున్న అత్యంత అధునాతన ఐదో తరం యుద్ధ విమానాలను చైనా పాక్‌ కు అమ్మనుంది. ఇవే ‘జే-35’ యుద్ధ విమానాలు. ఇవి అమెరికా ‘ఎఫ్‌-35 లైట్నింగ్‌ 2’ యుద్ధ విమానాలతో సమాన శక్తిసామర్థ్యాలున్నవి.

చైనా తాజాగా తాను తయారుచేసిన ఆరోతరం యుద్ధ విమానాన్ని సైతం ప్రదర్శించిందట. మన వద్ద ప్రస్తుతం ఉన్నవి నాలుగోతరం యుద్ధ విమానాలు. ఎంతో వివాదం రేపిన, ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రఫెల్‌ యుద్ధ విమానాలు కూడా నాలుగో తరానివే. అత్యాధునిక తర విమానాల అభివృద్ధి దిశగా భారత్‌ రూ.15 వేల కోట్లతో ‘అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎంసీఏ)’ ప్రాజెక్టు చేపట్టింది. మరో పదేళ్లకు గాని అవి అందుబాటులోకి రావట

స్టెల్త్‌.. అంటే శత్రు రాడార్లకు చిక్కకుండా ఉండగలగడం, మళ్లీ మళ్లీ ఇంధనం సరఫరా చేయాల్సిన అవసరం లేకుండానే గంటకు 1200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించడం. బ్యాలెన్స్ కోల్పోకుండా ఎటైనా తిరగగలిగే సత్తా ఉన్నవే ఐదో తరం యుద్ధ విమానాలు. ఇవి అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. చైనా ఆరో తరం యుద్ధ విమానాన్ని కూడా ప్రదర్శించింది. చిత్రంగా దీనికి ‘వైట్‌ ఎలిఫెంట్‌’/జె-36గా పేరు పెట్టింది.

Tags:    

Similar News