బాబు బంగారమే...అక్కడ అంచనాలకు అందనంత !
ఈ రోజు హైదరాబాద్ లో రియల్ బూం ఈ స్థాయిలో ఉంది అంటే దానికి పునాది బలంగా వేసిన వారుగా చంద్రబాబుని చూడాల్సి ఉంది.
అవును బాబు బంగారమే. టీడీపీ అధినేత చంద్రబాబు నిజంగా బంగారమే. ఆయన విజన్ తో మట్టి కూడా బంగారం అవుతుంది. ఒకనాడు ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్న బాబు తనదైన విజనరీతో సైబరాబాద్ సృష్టికర్త అయ్యారు. ఆ తరువాత అక్కడ భూముల ధరలు ఎంతలా పెరిగిపోయాయో అంతా చూస్తూనే ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో రియల్ బూం ఈ స్థాయిలో ఉంది అంటే దానికి పునాది బలంగా వేసిన వారుగా చంద్రబాబుని చూడాల్సి ఉంది.
మరో వైపు చూస్తే చంద్రబాబు పట్టుదల పట్టాలంటే పర్ర భూములు కూఒడా పంట భూములు అవుతాయి. ఇపుడు అదే జరుగుతుంది. 2014లో విభజన ఏపీకి తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాడే నిర్ణయించారు. ఏపీకి ప్రపంచ రాజధానిని నిర్మిస్తానని. అయితే తొలి టెర్మ్ లో సాధ్యం కానిది ఇపుడు ఆయన చేసి చూపించబోతున్నారు.
ఈసారి ఎటు నుంచి ఏమి జరిగినా అమరావతి రాజధాని అంబరాన్ని చుంబించడం ఖాయం. అమరావతి రాజధాని సమీప భవిష్యత్తులో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండడం ఖాయం. ఇక దానికి మరో బలమైన సంకేతం అన్నట్లుగా చంద్రబాబు వెలగపూడిలో అయిదు ఎకరాల స్థలాన్ని కొన్నారు.
చంద్రబాబు కొన్నారూ అంటే ఇక అంచనాలు అందుకోవడం సమీప భవిష్యత్తులో కష్టమే అని అంటున్నారు. అమరావతి రాజధాని ప్రాంతం ఫ్యూచర్ లో మరో జూబ్లీ హిల్స్ లాగానో లేక బంజారా హిల్స్ లాగానో అవడం ఖాయమని అంటున్నారు.
చంద్రబాబు కేరాఫ్ అమరావతి అన్నారంటేనే అక్కడ భూముల విలువ ఒక్కసారిగా పెరిగిపోతోంది అని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు తొందరలో భారీ భవంతులను తన నివాసం కోసం నిర్మించుకుంటారని తెలుస్తోంది. అందుకే బాబు ఇంటి కోసం భూములు కొనగానే మిగిలిన వారు ఎవరైనా కూడా అమరావతిలో భూములు కొనాలనుకుంటే ఇదే సరైన సమయం అని అంటున్నారు.
ఎందుకంటే లేట్ అయితే ఇక అక్కడ భూములను కొనడం సాధ్యం కాదనే అంటున్నారు. అంతలా రియల్ బూం ఊపందుకోవడం ఖాయమ్ని అంటున్నారు. ఇప్పటికే సీఆర్డీయే ఏకంగా 12 వేల కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లను పిలుస్తోంది. జనవరి నుంచి నిర్మాణం పనులు మొదలవుతాయి. మూడేళ్ల కాలంలో ఆ పనులు అన్నీ పూర్తి అవుతాయి.
దానితో సమాంతరంగా ప్రైవేట్ ప్రాజెక్టులకు ఇచ్చిన భూమూలలో కూడా నిర్మాణాలు మొదలవుతాయి. ఇక బసవతారకం ఆసుపత్రికి ఇచిచ్న భూములలో జనవరిలో శంకుస్థాపనను చేయడానికి బాలక్రిష్ణ నిర్ణయించారు అని అంటున్నారు. మొదటి దశలో మూడు వందల పడకల కోసం ఆసుపత్రిని నిర్మిస్తారు అని అంటున్నారు. దానిని వేయి పడకల ఆసుపత్రిగా మారుస్తారని కూడా చెబుతున్నారు.
ఇంకో వైపు చంద్రబాబు కూడా సొంత ఇంటి నిర్మాణాం చేపడుతున్నారు అంటే అమరావతి రాజధాని వైభోగం చెప్పతరమా అని అంటున్నారు. అందుకే అమరావతిలో మనకూ ఒక జాగా ఉండాలంటే ఇపుడే పాగా వేయడం మంచిది అని అంటున్నారు. నిన్నటికీ నేటికీ కూడా అక్కడ రేట్లు బాగా పెరిగిపోయాయి. మరో ఆరేడు నెలలు గడిస్తే అక్కడ భూముల ధరలు బంగారం అయి కొండెక్కి కూర్చుంటాయని అంటున్నారు.
అందువల్ల ఎవరికైనా అమరావతిలో భూములు కొనాలన్న ఆలోచన ఉంటే మాత్రం తొందర పడటం మంచిదని అంటున్నారు. హైదరాబాద్ లో సైట్ ఉందని ఇప్పటిదాకా గర్వించేవారు ఒక స్టాటస్ సింబల్ గా ఫీల్ అయ్యేవారు. కానీ అమరావతితో ఇపుడు సరికొత్త ట్రెండ్ క్రియేట్ కాబోతోంది.
అమరావతిలో ఒక సైట్ ఉంటే చాలు వారి హోదాయే మారిపోతుంది. అపర కుబేరిడి జాబితలో వారి పేరు ఎక్కబోతుంది అని ధీమాగా చెబుతున్నారు. మొత్తానికి బాబు చెప్పినట్లుగానే అమరావతిని తీర్చిదిద్దుతున్నారు. అమరావతిలో ఆయన ఇల్లు కట్టుకోవడం కూడా అందులో భాగమే అని అంటున్నారు. బాబుకు ఇల్లు ఏపీలో ఉందా అని అడిగేవారికి ఆయన చాలా బిగ్ సౌండ్ తో జవాబు ఇవ్వబోతున్నారు. అంతే కాదు బాబు చేతి చలువతో అమరావతి భూములు కూడా బంగారం కాబోతున్నాయని అంటున్నారు. సో అమరావతి రేపటి ఏపీ డెవలపమెంట్ కి గేట్ వే అంటే ఏమైనా డౌట్లు ఉన్నాయా అంటే నో అని గట్టిగా చెప్పాల్సిందే.