మనోజ్ కెరీర్‌ను మరింత దెబ్బ కొట్టిన మోహన్‌బాబు...!
ఈ గొడవలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు... గత మూడేళ్లుగా నలుగుతూనే ఉన్నాయి.
సినీయర్ హీరో మోహన్ బాబు కుటుంబం అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. అలాంటి కుటుంబంలో కుటుంబ కలహాలు ఇప్పుడు వీధిన పడ్డాయి. ఈ గొడవలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు... గత మూడేళ్లుగా నలుగుతూనే ఉన్నాయి. అవి ఇప్పుడు ఒక్కసారిగా బ్లాస్టింగ్ అయ్యాయి. దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనికా రెడ్డిని మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు. అంతకు ముందే మనోజ్‌కు తన అన్న భార్య వెరోనికా రెడ్డి స్నేహితురాలు ప్రణీతా రెడ్డితో వివాహం జరిగింది. పెళ్లైన యేడాదికే వీరి మధ్య మనస్పర్థల నేపథ్యంలో విడిపోయారు.
అయితే భూమా ఫ్యామిలీకి తిరుపతిలో ఉన్న వ్యాపారాల నేపథ్యంలో మంచు కుటుంబానికి చిన్నప్పటి నుంచే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలా మనోజ్‌కు, మౌనికకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. వీరు ఒకరికి ఒకరు బాగా తెలుసు. మౌనికకు బెంగళూరుకు చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్‌తో పెళ్లి జరగడం.. ఓ బాబు పుట్టాక మనస్పర్థల నేపథ్యంలో వారు విడిపోవడం.. ఇటు మనోజ్ కూడా పిల్లలు లేకుండానే తన ప్రణీతకు విడాకులు ఇవ్వడం జరిగిపోయాయి. చివరకు పాత స్నేహం చిగురించి వీరు ప్రేమలో పడ్డారు.
అప్పటికే మౌనికకు మొదటి భర్తతో కొడుకు ఉండడం.. ఆమెను తమ ఇంటి కోడలిగా అంగీకరించేందుకు మోహన్‌బాబు ఫ్యామిలీకి అస్సలు ఇష్టం లేదు. అసలు ఈ పెళ్లి కూడా మంచు లక్ష్మి దగ్గరుండి చేశారు. ఇక ఇప్పుడు మోహన్‌బాబు సుదీర్ఘంగా రిలీజ్ చేసిన ఆడియో క్లిప్‌లో మనోజ్‌తే తప్పంతా అన్నట్టు మాట్లాడారు. దీనిని బట్టి మనోజ్ చెప్పిన ప్రకారం అటు భార్య మౌనిక వైపు ఆస్తులు రాలేదు.. ఇటు మోహన్‌బాబు చెప్పిన దాని ప్రకారం ఆయన ఆస్తులు ఇంకా పంచలేదు.. మోహన్‌బాబు మాటల్లో ఆస్తులు ముగ్గురికీ సమానంగా రాయాలా ? వద్దా ? అనేది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా.. లేదా.. దాన ధర్మాలు చేస్తానా.. అన్నది నా ఇష్టం అని చెప్పారు.
తండ్రి స్థానంలో ఉన్న మోహన్‌బాబు మనోజ్‌దే తప్పంతా అన్నట్టుగా మాట్లాడారు. అసలే మనోజ్ కెరీర్ బాలేదు. సినిమాలు మానేశాడు.. చేసిన సినిమాలు కలిసి రాలేదు. మొదటి పెళ్లి నిలవలేదు... రెండో పెళ్లి కూడా కాంట్రవర్సీ అయ్యింది. రెండో పెళ్లి తర్వాత మనోజ్ కెరీర్ ఇప్పుడే గాడిన పడుతుంది. పాప పుట్టింది.. ఓ టాక్ షో చేస్తే మంచి హిట్ అయ్యింది. మిరాయ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సొంతంగా సినిమాలు చేసుకునే ప్లాన్ ఉంది. ఈ టైంలో మోహన్‌బాబు తన బిడ్డ తాగుడికి బానిస అని చెప్పడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు.. ఏదేమైనా మనోజ్ ఆత్మ గౌరవం మంట కలిపేలా.. అతడి కెరీర్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా మోహన్‌బాబు వ్యాఖ్యలు ఉన్నాయి.