చంద్రబాబు కాలు మీద కాలు... మరి రేవంత్ ?
ఈ ఇద్దరు సీఎం భేటీ అయింది దావోస్ టూర్ కి వెళ్తూ జ్యూరిచ్ ఎయిర్ పోర్టు వెయింటింగ్ లాంజ్ లో కలిశారు.
ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు దేశం కాని దేశంలో కలుసుకున్నారు. ఈ ఇద్దరూ కలసి కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి హావ భావాల గురించి వారి ముఖ కవలికల గురించి అలాగే బాడీ లాంగ్వేజ్ గురించి కూడా చర్చించే వారు ఉంటారు కదా. ఆ ఇద్దరూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు సీఎం భేటీ అయింది దావోస్ టూర్ కి వెళ్తూ జ్యూరిచ్ ఎయిర్ పోర్టు వెయింటింగ్ లాంజ్ లో కలిశారు.
అలా అనుకోకుండా కలసిన ఈ ఇద్దరు సీఎంలు అనేక విషయాలు చర్చించుకున్నారు. ఆ ఫోటోని ఎక్స్ లో షేర్ చేస్తూ తెలంగాణా సీఎం ట్వీట్ చేశారు. మేమిద్దరం రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు గురించి చర్చించుకున్నామని ఆయన ఈ ట్వీట్ లో పేర్కొన్నారు.
దానికి ఏపీ సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. రెండు రాష్ట్రాలు ఒక ఆత్మ అన్నారు. తెలుగు సమాజం ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలి అని పేర్కొన్నారు. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం ఆనందంగా ఉందని బదులు ఇచ్చారు.
ఇదిలా ఉంటే తెలంగాణా సీఎంతో భేటీ వేసిన సందర్భంగా చంద్రబాబు కాలు మీద కాలు వేసి కూర్చున్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి మాత్రం మామూలుగా కూర్చున్నట్లుగా ఫోటోలో ఉంది. దీనిని చూసిన వారు బాబు సీనియర్ కదా అని వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో టీడీపీలో రేవంత్ రెడ్డి చాలా కాలం పనిచేశారు. ఆయన బాబు నాయకత్వంలో పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు.
ఒక విధంగా చూస్తే టీడీపీలో రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్ ఒక ఊపులో సాగింది అని చెప్పాలి. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లో చేరి తన సత్తా చాటి పీసీసీ చీఫ్ అయ్యారు అలా ఆయన తనదైన పనితీరుతో తన ప్రతిభతో వ్యూహాలతో తెలంగాణా సీఎం అయ్యారు.
నిజంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన అతి తక్కువ సమయంలో సీఎం కావడం అంటే అది రేవంత్ రెడ్డి సాధిచ్నిన ఘనతగా పేర్కొంటారు. అదే సమయంలో ఆయన చంద్రబాబుని ఎపుడూ గౌరవిస్తూనే ఉన్నారు. గురువు అంటే తాను ఒప్పుకోనని సహచరుడిని అంటే సంతోషిస్తాను అని కూడా రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఏది ఏమైనా సీనియర్ గా చంద్రబాబు అలా కనిపిస్తే ఆయన ఒకనాటి సహచరుడిగా రేవంత్ రెడ్డి ఈ ఫోటోలో కనిపించారు అని అంటున్నారు.