షర్మిల కనిపించుట లేదు.. !
అయితే.. గత నెల రోజుల నుంచి కూడా షర్మిలకు ప్రధాన మీడియా ప్రాధాన్యం తగ్గించేసింది.
అదేంటి? అనుకుంటున్నారా? కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల కనిపించకపోవడం ఏంటని భావిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానం వినిపిస్తోంది. ఒక్కసారి గతంలోకి అంటే.. నెల రోజుల కిందటకు వెళ్తే.. షర్మిల చేసిన వ్యాఖ్యలు.. ఆమె పెట్టే ప్రస్ మీట్లకు ప్రాధాన్యం ఉండేది. ప్రధాన పత్రికలు.. ప్రధాన మీడియా కూడా.. షర్మిలకు భారీ కవరేజీ ఇచ్చేవి. షర్మిల మాట్లాడితే వార్త! అన్నట్టుగా వ్యవహరించారు.
అయితే.. గత నెల రోజుల నుంచి కూడా షర్మిలకు ప్రధాన మీడియా ప్రాధాన్యం తగ్గించేసింది. ఒకప్పుడు బ్యానర్ ఐటంలు, ఫస్ట్ పేజీ ఐటంలుగా ప్రచురించి.. గొప్పగా హైలెట్ చేసిన విషయం తెలిసిందే. అయి తే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గత నెల రోజులుగా షర్మిల ఎక్కడ మాట్లాడినా.. పెద్దగా పట్టించు కోవడం మానేశారు. నిన్న మొన్నటి వరకు కనీసం.. ఆమె వార్తలు లోపలి పేజీల్లో అయినా.. ఎక్కడో ఒక చోట చిన్న ఫొటోతో సహా కనిపించేవి.
కానీ, రాను రాను షర్మిలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ప్రధాన మీడియా షర్మిల వార్తలకు ప్రాధాన్యం తగ్గిం చేసింది. పోనీ.. షర్మిల బయటకు రావడం లేదా? ట్విట్టర్‌లో స్పందించడం లేదా? అంటే.. స్పందస్తు న్నారు. కానీ, ఆమెకు మైలేజీ రావడం లేదు. మీడియా కూడా పట్టించుకోవడం లేదు. దీనికి కారణం ఏంటి? అనేదిమిలియన్ డాలర్ల ప్రశ్న. ఆమె జగన్‌ను తిట్టకపోవడం.. వైసీపీపై దూకుడు తగ్గించడం.. ప్రధాన కారణాలు. అంతేకాదు.. మరో కోణం కూడా ఉంది.
కూటమి సర్కారుపై గత నెల రోజుల నుంచి నిశిత విమర్శలు చేస్తున్నారు షర్మిల. వరద సాయం సహా.. ఇతర అంశాలపై దూకుడుగావ్యవహరిస్తున్నారు. తాజాగా మద్యం లాటరీ విషయంలో సిండికేట్ వ్యవహా రాన్ని షర్మిల నిలదీశారు. జగన్‌ను ఎలా అయితే ఆమె నిలదీశారో.. ఇప్పుడు చంద్రబాబును కూడా అలానే నిలదీశారు. సిండికేట్ వ్యవహారం అంతా కూడా చంద్రబాబుకు తెలిసే జరుగుతోందన్నారు. అయితే.. ఎక్కడా షర్మిల ఊసు కానీ, మాట కానీ.. ప్రధాన మీడియా ప్రచురించలేదు. సో.. ఇప్పటికైనా.. షర్మిల తన స్థాయి.. ఏంటో గుర్తించాలని అంటున్నారు పరిశీలకులు.