ఏపీలోకి సీబీఐ రావొచ్చు... కండిషన్స్ అప్లై!

సీబీఐ విచారణకు సాధారణ సమ్మతి ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2024-08-20 17:04 GMT

ఏపీలో కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో సీబీఐ విచారణ పరిధిని కొనసాగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం - 1946 లోని సెక్షన్ 3 ప్రకారం విచారణ పరిధి పెంచుతూ ఆదేశాలిచ్చింది. సీబీఐ విచారణకు సాధారణ సమ్మతి ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

అవును... బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీబీఐకు జనరల్ కన్సెంట్ ఉపసంహరించిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కూడా 2018లో సీబీఐకి ఏపీలో జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకున్నారు. జగన్ సీఎం అయ్యాక మళ్లీ పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో తాజాగా బాబు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు.

ఈ సందర్భంగా సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం పలు కండిషన్స్ ముందు పెట్టింది! ఇందులో భాగంగా... సీబీఐ పరిధిలో నిర్ధేశించిన నేరాల విచారణ కొసం రాష్ట్ర ప్రభుత్వం సాధారణ అనుమతి ఇచ్చింది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే నేరుగా విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే విచారణ చేపట్టేలా నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇదే సమయంలో... జూలై 1 నుంచే ఈ గెజిట్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది! అయితే... ఇవి జగన్ సర్కార్ లో ఉన్నవే కనుక ఇవి కొనసాగింపుకిందే లెక్క.. అంతకు మించి ప్రత్యేకత ఏమీ లేదు.. ఎప్పటిలాగానే సీబీఐ ఏపీలోకి వస్తుంది!

అయితే... ఏపీలోకి వచ్చిన సీబీఐ సొంతంగా కేసులు పెట్టే అవకాశం ఉండదు.. కేంద్ర పరిధిలో ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు కానీ.. మిగిలిన విషయాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు మాత్రమే పనిచేయాలి.. లేదా.. కోర్టులు ఆదేశించాలి.

కాగా... రాజకీయ ప్రత్యర్థుల వేటను సీబీఐని కేంద్రం వినియోగించుకుంటోందని ఇతర పార్టీలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు కూడా 2018లో బీజేపీతో విభేదించిన తర్వాత ఈ కారణంతోనే ఉపసంహరించారు! అయితే ఇప్పుడు తిరిగి ఎన్డీయేలో భాగంగా ఉన్నందునో ఏమో కానీ... చంద్రబాబు సర్కార్ సీబీఐకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జరీ చేసింది!

Tags:    

Similar News