ఈసారి అసెంబ్లీలో పవన్ పవర్ ఫుల్ అంతే !?

ఈసారి అసెంబ్లీలో జనసేన బలమైన ముద్ర ఉండాల్సిందే అని చాలా కాలంగా చెబుతున్న పవన్ ఆలోచనలు ఆ దిశగా ఫలించాయని అంటున్నారు.

Update: 2024-05-31 03:00 GMT

ఈసారి అసెంబ్లీలో ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. అదే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆగమనం. ఆయన ఒక్కరే అసెంబ్లీకి వెళ్ళినా ఆ లెక్కే వేరు. అయితే పోలింగ్ ముగిసిన తరువాత వస్తున్న అంచనాల బట్టి పవన్ ఒక పది మంది జనసేన ఎమ్మెల్యేలు తక్కువ కాకుండా తన వెంట బెట్టుకుని దర్జాగా అసెంబ్లీ ప్రవేశం చేస్తారు అని అంటున్నారు.

ఈసారి అసెంబ్లీలో జనసేన బలమైన ముద్ర ఉండాల్సిందే అని చాలా కాలంగా చెబుతున్న పవన్ ఆలోచనలు ఆ దిశగా ఫలించాయని అంటున్నారు. పవన్ తో పాటు పది మంది ఎమ్మెల్యేలకు తక్కువ కాకుండా అంటే ఈసారి అసెంబ్లీలో జనసేన ఫోకస్ వేరే లెవెల్ అని అంటున్నారు. జనసేన ఒక బలమైన గొంతుకే అసెంబ్లీలో వినిపిస్తుంది అని అంటున్నారు.

వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీతో పాటుగా విపక్షంలో జనసేన తనదైన పద్ధతిలో విపక్షం పాత్ర చాలా ఫోకస్డ్ గానే పోషిస్తుంది అని అంటున్నారు. అదే టీడీపీ కూటమి గెలిస్తే ప్రభుత్వంలో జనసేన చాలా ప్రధానమైన పాత్రనే పోషిస్తుంది అని అంటున్నారు.

ఈసారి అసెంబ్లీ 2019 మాదిరిగా ఏకపక్షంగా సాగే చాన్స్ లేదు. అలాగే 2014లో మాదిరిగా కేవలం మూడు పార్టీలకే పరిమితం కాదు, నాలుగవ పక్షంగా జనసేన తన ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తుంది అని అంటున్నారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తాను బలమైన ప్రజా గొంతుకను అవుతాను అని పవన్ అంటూ వచ్చారు. దాంతో పవన్ పొజిషన్ లో ఉన్నా అపొజిషన్ లో ఉన్నా కెమెరా కళ్ళు అన్నీ ఆయన వైపే ఉంటాయని అంటున్నారు. అదే విధంగా పవన్ కూడా సీరియస్ పాలిటిక్స్ చేయడానికే రెడీ అవుతున్నారు అని అంటున్నారు.

అలాగని ఆయన సినిమాలు పక్కన పెట్టరని వాటిని చేస్తూనే రాజకీయాలకు మరింత సమయం కేటాయిస్తారు అని అంటున్నారు. అసెంబ్లీలో జనసేన ఎంత గట్టిగా ముద్ర వేయగలిగితే అంత బలంగా ఆ పార్టీకి జనంలో పార్టీ గ్రాఫ్ పెరిగే చాన్స్ ఉంటుంది.

రానున్న రోజూల్లో ఇదే వ్యూహంతో జనసేన పనిచేస్తుంది అని అంటున్నారు. ఇక చంద్రబాబు జగన్ ఇద్దరూ అసెంబ్లీ వేదికగా అనేక సార్లు తలపడ్డారు కానీ ఎపుడూ కూడా పవన్ జగన్ ఎదురు కాలేదు. ఈసారి ఆ ముచ్చట అసెంబ్లీ వేదికగా తీరుతుంది అని కూడా అంటున్నారు. చాలా మంది చూసేది కూడా ఆ అరుదైన సన్నివేశం కోసమే అని అంటున్నారు. పవన్ జగన్ మధ్య మాటలు కానీ డిబేట్స్ కానీ ఎలా ఉండోబోతాయన్నది కూడా ఆసక్తికరమైన అంశమే అని అంటున్నారు.

Tags:    

Similar News