చంద్రయాన్-3.. సైంటిస్టులు జీతాలు ఎంతో తెలుసా?
చంద్రయాన్-3 విజయంతో భారత్ సూర్యుడిపై అధ్యయనానికి సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది
జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ ను దించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. జూలై 14 ప్రయోగించిన చంద్రయాన్-3.. 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు 23న చంద్రుడిపైన ల్యాండర్ ను సురక్షితంగా దింపింది.
చంద్రయాన్-3 విజయంతో భారత్ సూర్యుడిపై అధ్యయనానికి సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట వేదిక కానుంది. దీన్ని కూడా విజయవంతంగా ప్రయోగించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు.
కాగా చంద్రయాన్-3 విజయవంతం కావడంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు, సహాయక సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఇస్రో ఉద్యోగులు జీతాలు ఎంత? ఎవరికి ఎక్కువ జీతం వంటి వివరాలను పరిశీలిస్తే..
వివిధ నివేదికల ప్రకారం.. ఇస్రోలోని ప్రముఖ శాస్త్రవేత్తలకు నెలకు రూ.2 లక్షల జీతం ఉందని తెలుస్తోంది. ఇక సీనియర్ సైంటిస్టులకు నెలకు రూ.75,000 నుంచి రూ.80,000 వరకు వేతనాలు ఉంటాయి. అలాగే ఇంజనీర్లు నెలకు రూ. 37,400 నుంచి రూ. 67,000 వరకు అందుకుంటారని తెలుస్తోంది. వీటితోపాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
టెక్నీషియన్ బీఎల్-3కి రూ. 21,700 - రూ. 69,100, టెక్నికల్ అసిస్టెంట్ ఎల్-7కు రూ. 44,900 - రూ.1,42,400, సైంటిఫిక్ అసిస్టెంట్ ఎల్-7కు రూ. 44,900 - రూ. 1,42,400 వేతన శ్రేణితో జీతాలు లభిస్తాయి.
ఇక లైబ్రరీ అసిస్టెంట్ ఏఎల్-7కి రూ. 44,900 - రూ. 1,42,400, టెక్నికల్ అసిస్టెంట్ (సౌండ్ రికార్డింగ్) డీఇసీయూ అహ్మదాబాద్ ఎల్-7కి రూ. 44,900 - రూ. 1,42,400, టెక్నికల్ అసిస్టెంట్ (వీడియోగ్రఫీ) డీఇసీయూ అహ్మదాబాద్ ఎల్-7కి రూ. 44,900 - రూ. 1,42,400, ప్రోగ్రామ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ ఎల్-8కి రూ. 47,600 - రూ. 1,51,100, సోషల్ రీసెర్చ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ - ఎల్-8కి రూ. 47,600 - రూ. 1,51,100 వేతన శ్రేణిలో జీతాలు ఉంటాయి.
మీడియా లైబ్రరీ అసిస్టెంట్-ఏ, డీఇసీయూ అహ్మదాబాద్ - ఎల్-7కి రూ. 44,900 - రూ. 1,42,400
సైంటిఫిక్ అసిస్టెంట్- ఏ (మల్టీమీడియా), డీఇసీయూ అహ్మదాబాద్ - ఎల్-7కి రూ. 44,900 - రూ. 1,42,400)
జూనియర్ ప్రొడ్యూసర్ ఎల్-10కు రూ. 56,100 - రూ. 1,77,500
సామాజిక పరిశోధన అధికారి-సీఎల్-10కు రూ. 56,100 - రూ. 1,77,500
సైంటిస్ట్/ ఇంజనీర్-ఎస్ సీ ఎల్-10కు రూ. 56,100 - రూ. 1,77,500
సెంటిస్ట్/ ఇంజనీర్-ఎస్‌డీఎల్-11కి రూ. 67,700 - రూ. 2,08,700
మెడికల్ ఆఫీసర్-ఎస్‌సీఎల్-10కి రూ. 56,100 - రూ. 1,77,500
మెడికల్ ఆఫీసర్-ఎస్‌డీఎల్ 11కి రూ. 67,700 - రూ. 2,08,700
రేడియోగ్రాఫర్-ఏఎల్-4కి రూ. 25,500 - రూ. 81,100
ఫార్మసిస్ట్-ఏఎల్-5కి రూ. 29,200 - రూ. 92,300
ల్యాబ్ టెక్నీషియన్-ఏఎల్-4కి రూ. 25,500 - రూ. 81,100
నర్సు-ఏఎల్ 7కి రూ. 44,900 - రూ. 1,42,400
సిస్టర్-ఏఎల్-8కి రూ. 47,600 - రూ. 1,51,100
క్యాటరింగ్ అటెండెంట్ ఏఎల్-1కి రూ. 18,000 - రూ. 56,900
క్యాటరింగ్ సూపర్‌వైజర్ - ఎల్-6కి రూ. 35,400 - రూ. 1,12,400
కుక్ - ఎల్-2కి రూ. 19,900 - రూ. 63,200
ఫైర్‌మ్యాన్-ఏఎల్-2కి రూ. 19,900 - రూ. 63,200
డ్రైవర్-కమ్-ఆపరేటర్-ఏఎల్-3కి రూ. 21,700 - రూ. 69,100
లైట్ వెహికల్ డ్రైవర్-ఏఎల్-2కి రూ. 19,900 - రూ. 63,200
హెవీ వెహికల్ డ్రైవర్-ఏఎల్-2కి రూ. 19,900 - రూ. 63,200
స్టాఫ్ కార్ డ్రైవర్ ఏఎల్ 2కి రూ. 19,900 - రూ. 63,200
అసిస్టెంట్ - ఎల్-4కి రూ. 25,500 - రూ. 81,100
అసిస్టెంట్ (రాజభాష) - ఎల్-4కి రూ. 25,500 - రూ. 81,100
అప్పర్ డివిజన్ క్లర్క్ - ఎల్-4కి రూ. 25,500 - రూ. 81,100
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ - ఎల్-4కి రూ. 25,500 - రూ. 81,100
స్టెనోగ్రాఫర్ - ఎల్-4కి రూ. 25,500 - రూ. 81,100
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - ఎల్-10కి రూ. 56,100 - రూ. 1,77,500
అకౌంట్స్ ఆఫీసర్ - ఎల్-10కి రూ. 56,100 - రూ. 1,77,500
పర్చస్ - స్టోర్ ఆఫీసర్ - ఎల్-10కి రూ. 56,100 - రూ. 1,77,500
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- ఎల్6కి రూ. 35,400 - రూ. 1,12,400