ఐటి శాఖ రూటుమార్చిందా ?

సోమవారం ఉదయం నుండి ఐటిశాఖ ఉన్నతాధికారులు దాదులు మొదలుపెట్టారు. ఏకకాలంలో గ్రేటర్ హైదరాబాద్ లోని 15 ప్రాంతాల్లో తమ సోదాలు చేస్తున్నారు.

Update: 2023-11-13 04:43 GMT

సోమవారం ఉదయం నుండి ఐటిశాఖ ఉన్నతాధికారులు దాదులు మొదలుపెట్టారు. ఏకకాలంలో గ్రేటర్ హైదరాబాద్ లోని 15 ప్రాంతాల్లో తమ సోదాలు చేస్తున్నారు. ఫార్మా కంపెనీ ఛైర్మన్ , డైరెక్టర్ల ఇళ్ళు, ఆపీసులతో పాటు మంత్రి, మహేశ్వరం ఎంఎల్ఏ అభ్యర్ధి సబితా ఇంద్రారెడ్డి బంధుల ఇళ్ళపైన కూడా దాడులు మొదలయ్యాయి. ఇక్కడే ఐటి శాఖ రూటు మార్చిందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే తాజా దాడుల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల్లో ఎవరినీ టార్గెట్ చేసుకోకపోవటమే.

ఎన్నికల ప్రక్రియ మొదలై ఊపందుకుంటున్న సమయంలో ఐటి శాఖ చేసిన దాడులన్నీ కాంగ్రెస్ అభ్యర్ధులు, నేతల మీద మాత్రమే. కుందూరు జానారెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పారిజాత నర్పసింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి ఇళ్ళు, ఆఫీసులపైన పదేపదే దాడులుచేసిన విషయం తెలిసిందే. దాంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయి తమను టార్గెట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు, అభ్యర్ధులు ఎదురుదాడులకు దిగారు. ఐటి శాఖ చేసిన దాడులను చూసిన జనాలు కూడా ఇదే నిజమని నమ్మారు.

ఐటి శాఖ దాడులకు బీజేపీకి సంబంధంలేదని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు సమర్ధించుకున్నా జనాలు నమ్మలేదు. దాంతో అర్జంటుగా ఆరోపణలనుండి బయటపడాల్సిన అవసరం బీజేపీకి వచ్చింది. అందుకనే ఫార్మా కంపెనీ ఛైర్మన్, డైరెక్టర్లు, మంత్రి సబితా రెడ్డి బంధువుల ఇళ్ళపైన దాడులు మొదలయ్యాయి. తమంతట తాముగానే ఐటి శాఖ దాడులు చేయటంలేదని అర్ధమవుతోంది.

దానికి కారణం ఏమిటంటే పోటీచేస్తున్న వారిలో రియాల్టర్లు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు అన్నీ పార్టీల్లోను ఉన్నారు. అలాంటిది అచ్చంగా కాంగ్రెస్ అబ్యర్ధుల మీద మాత్రమే దాడులు చేయటం ఏమిటి ? జరుగుతున్న దాడుల తీరు చూసిన తర్వతే జనాలు కూడా ఇవన్నీ కక్షసాధింపుతో చేస్తున్న దాదులుగానే నిర్ధారణకొచ్చారు. అందుకనే తాజా దాడుల్లో సబితా ఇంద్రారెడ్డి బంధులను కూడా చేర్చినట్లున్నారు. అయినా జనాలు బీజేపీని, కేంద్రప్రభుత్వాన్ని నమ్ముతారా ? ఏమో చివరకు ఏమవుతుందో ? దీని ప్రభావం ఎలాగుంటుందో చూడాల్సిందే.


Tags:    

Similar News