వైసీపీలో సంక్షోభం వేళ లండన్ ఫ్లైట్ ఎక్కేస్తున్న జగన్

అయితే మాత్రం జగన్ వీటి మీద పెద్దగా పట్టించుకుంటున్నారా అన్న చర్చ హాట్ హాట్ గా సాగుతోంది.

Update: 2024-08-30 17:18 GMT

వైసీపీలో సంక్షోభం కొనసాగుతోంది. రోజుకో ఇద్దరు ముగ్గురు ప్రజా ప్రతినిధులు తమ పదవులు వదులుకుంటున్నారు. ఇది నిజంగా ఏపీలోనే కాదు దేశంలోనే కొత్త రాజకీయం. ఉన్న పదవిని వదులుకుని కొత్త పదవి వస్తుందో రాదో తెలియకుండా రిస్క్ చేస్తూ కూడా వైసీపీ గోడ దూకి పోతున్నారు అంటే చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. అయితే మాత్రం జగన్ వీటి మీద పెద్దగా పట్టించుకుంటున్నారా అన్న చర్చ హాట్ హాట్ గా సాగుతోంది.

నిన్నటికి నిన్న ఇద్దరు రాజ్యసభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే ఇరవై నాలుగు గంటలు గడవకుండానే ఇద్దరు ఎమ్మెల్సీలు తమ పదవులు వదులుకుంటూ వైసీపీకి షాకిచ్చారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది. పార్టీలో వారికి వచ్చిన బాధ ఏంటి వారు పోతే పోయారు. మిగిలిన వారి మనో భావాలు ఎలా ఉన్నాయి. పార్టీ క్యాడర్ డీ మోరలైజ్ అవుతున్నారా ఏమిటి అన్నది వైసీపీ ఆరా తీయాల్సిన పరిస్థితి ఉంది అని అంటున్నారు

కానీ జగన్ మాత్రం ఈ మొత్తం వ్యవహారాల పట్ల అంతగా దృష్టి పెట్టినట్లుగా కనిపించడం లేదు అని అంటున్నారు. మరో వైపు చూస్తే బాలీవుడ్ నటీమణి తనకు వైసీపీ ప్రభుత్వంలో వేధింపులు అయ్యాయని వేలెత్తి చూపిస్తున్నారు. ఆమె ఏకంగా ముంబై నుంచి వచ్చి మరీ విజయవాడ సీపీని కలసి ఫిర్యాదు చేశారు.

ఇది రచ్చ అవుతోంది. వైసీపీ ఇమేజ్ నే దెబ్బతీస్తోంది. దాని మీద డిబేట్ లు పెడుతూ మీడియా వైసీపీని ఏకుతోంది. దీనికి కూడా సరైన ఖండన కానీ సరిగ్గా తమను తాము డిపెండ్ చేసుకోవడం కానీ వైసీపీ చేయడం లేదు అని అంటున్నారు. దాంతో ఇందులో నిజమెంత ఉందో లేదో తెలియదు కానీ రాజకీయంగా వైసీపీ బదనాం అవుతోంది.

ఇక క్రిష్ణ జిల్లా గుడ్లవల్లేరు లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు పెట్టి మరీ విధ్యర్ధుల వీడియోలు తీశారు అన్న ఇష్యూ ఏపీలో మంట రాజేసింది.టీడీపీ కూటమి ఒక్కసారిగా ఇరుకున పడిపోయింది. అత్యంత సున్నితమైన అంశం ఇది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు అని నోటి మాటగా విమర్శిస్తున్న వైసీపీకి రాజకీయంగా అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే చాన్స్ వచ్చింది.

బాధితుల తరఫున నిలబడి పోరాడి కూటమి పెద్దలకు ముచ్చెమటలు పట్టించాల్సిన పరిస్థితి ఉంది. అయినా సరే వైసీపీ నుంచి సరైన రియాక్షన్ లేదని అంటున్నారు. ఏపీలో నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ నుంచి చీఫ్ గా ఉన్న షర్మిల అయితే దీని మీద బాగానే రియాక్ట్ అయ్యారు. అది కూడా చాలా త్వరగానే అని అంటున్నారు.

ఏది ఏమైనా వైసీపీ ఏమి చేయబోతోంది అని అంటున్నారు. పార్టీ ఇబ్బందులలో ఉన్న వేళ జగన్ సెప్టెంబర్ 3 నుంచి 25 వరకూ ఏకంగా విదేశీ టూర్లు చేయడం మంచిదేనా అన్న చర్చ వస్తోంది. పార్టీలో మరో ఆల్టర్నేషన్ నాయకత్వం కానీ పార్టీ యంత్రాంగం కానీ సెటప్ చేయలేదు వైసీపీ.

దాంతో వైసీపీని దాని మానాన గాలికి వదిలేసి జగన్ పోతున్నారా అన్న చర్చ వస్తోంది. మరి జగన్ ఉంటేనే ఇలా గోడ దూకుళ్ళు చేస్తూ పార్టీని దెబ్బ తీస్తున్నారు దాంతో జగన్ లండన్ ఫ్లైట్ ఎక్కగానే సెప్టెంబర్ సంక్షోభం వైసీపీని చుట్టుముడుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి వైసీపీ అధినేత ఆలోచనలు ఏమిటో.

Tags:    

Similar News