జగన్ నాయకులు అక్కడ ఉన్నారా... భేష్ !

ఇప్పటికైనా అలా కాకుండా జనం నుంచి నాయకులు అన్న మాటకు జగన్ కట్టుబడి లీడర్ షిప్ ని డెవలప్ చేస్తే వైసీపీ మరింత కాలం మనగలుగుతుందని అంటున్నారు.

Update: 2024-09-21 04:05 GMT

వైసీపీ నుంచి సీనియర్లు ఒక్కొక్కరుగా బయటకు పోతున్నారు. అయితే వారు ఎందుకు వెళ్తున్నారో వారికీ తెలుసు. జగన్ కి తెలుసు. కానీ మీడియాలో మాత్రం జగన్ కి భారీ షాక్ అని రాస్తున్నారు. దానిని చూసి వైసీపీ అధినాయకత్వం లైట్ తీసుకుంటుందనే అంటున్నారు.

అది నిజమని ఇపుడు తేలింది. తిరుపతి లడ్డూ ప్రసాదం లో కల్తీ నేయి వాడారు అంటూ చంద్రబాబు ఆరోపణలు చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చెందుకు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా జగన్ ని ప్రశ్నించింది.

మీ పార్టీ నుంచి సీనియర్లు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు అని గుచ్చు గుచ్చి అడిగింది. దానికి జగన్ కూడా లైట్ తీసుకుంటూ యా పోతాండారు. పోనీయండి అని రాయలసీమ యాసలో బదులిచ్చారు. నాయకులు పోతే మళ్లీ నాయకులు వస్తారు అని ఈ సందర్భంగా జగన్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

నాయకులు జనంలో నుంచి పుడతారు అని కూడా అన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్ర స్థాయీలో వస్తే ఎవరూ మిగలరు అని కూడా ఆయన అన్నారు. అంటే జగన్ ఆశలు జనం మీదనే అని మరోసారి అర్థం అయింది. సరే జగన్ నాయకులు వీరు కాదు మరి ఎక్కడ ఉన్నారు అంటే జనం నుంచి పుట్టుకుని వస్తారు అని అంటున్నారు.

వైసీపీలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకు చాన్స్ ఇస్తే వారే మంచి నాయకులు అవుతారు కదా అన్న చర్చ ఉంది. ఆ సాహసం జగన్ చేయలేరా అన్నది కూడా అంతా అంటున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ జనం నుంచే నాయకులను తయారు చేసి తీసుకున్నారు. వారే ఇంతటి పార్టీగా టీడీపీ తయారు కావడానికి కారణం అయ్యారు.

అలా పార్టీ పట్ల నిబద్ధత చిత్తశుద్ధితో ఉన్న వారిని ఎంపిక చేసుకుని ఆర్థికంగా బలం లేకపోయినా పని చేసే వారిని ప్రోత్సహిస్తే భేష్ కదా అని అంటున్నారు. నిజానికి ఈ రోజున జగన్ ని విడిచి పోతున్న నాయకులు అంతా అధికారం లేదనే. వైసీపీకి భారీ ఓటమి వచ్చిందని.

మళ్ళీ వైసీపీకి ఆదరణ ఉందని తెలిస్త అలా వెళ్ళిన వారే పరిగెత్తుకుని వస్తారు. కానీ ఈ అయారాం గయారాం ని తీసుకునే వైసీపీ పూర్తిగా నష్టపోయింది అని అంటున్నారు. ఇప్పటికైనా అలా కాకుండా జనం నుంచి నాయకులు అన్న మాటకు జగన్ కట్టుబడి లీడర్ షిప్ ని డెవలప్ చేస్తే వైసీపీ మరింత కాలం మనగలుగుతుందని అంటున్నారు.

అలా కాకుండా ప్రతిపక్షంలో పార్టీ ఉన్నపుడు క్యాడర్ ని పనిచేసిన లీడర్ ని వాడేసుకుని తీరా ఎన్నికల వేళ బిగ్ షాట్స్ కి టికెట్లు ఇస్తేనే ఇలా పార్టీకి కష్టకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.

మరి వైసీపీ పెట్టాక రెండు సార్లు ఓటమి పాలు అయింది. తొలిసారి ఓటమికి రెండోసారి ఓటమికి మధ్య తేడాను పార్టీని వీడి వెళ్తున్న నేతలను చూసి అయినా జగన్ తన రాజకీయ పంధాను మార్చుకుంటారని అంతా ఆశిస్తున్నారు. జగన్ చెప్పినట్లుగా జనం నుంచే లీడర్స్ వస్తారు. ఆప్ పార్టీ అలాగే నేతలను తయారు చేసుకుంది. కొత్తగా పార్టీ పెట్టినట్లుగా భావించి జగన్ జనం నుంచి వారు మెచ్చే నాయకులను ఎంచుకోవాల్సి ఉంటుందని అలాగే పనిచేసే వారికి ప్రోత్సాహం ఇవ్వాలని కూడా కోరుతున్నారు.

Tags:    

Similar News